Monday, April 29, 2024

హెచ్1బిలకు ఊరట

- Advertisement -
- Advertisement -

 H1B

 

నోటీసులపై స్పందించేందుకు 60రోజుల గ్రేస్ పీరియడ్
అమెరికా ప్రభుత్వం ఉత్తర్వులు

వాషింగ్టన్ : కరోనా కష్టాలతో పాటు హెచ్1బి వీసాల గండం ముంచుకొస్తుండడంతో అమెరికాలో ఆందోళనకు గురువుతున్న విదేశీయులకు, ముఖ్యంగా లక్షలాది మంది భారతీయులకు భారీ ఊరట లభించింది. అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సంబంధిత పత్రాలను సమర్పించాలంటూ నోటీసుల జారీ చేసిన హెచ్-1బి వీసాదారులకు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యుఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అవసరమైన పత్రాలను సమర్పించడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. ఈ మేరకు శనివారంనాడు ఉత్తర్వులిచ్చింది. దీంతో రెండు నెలలపాటు ఇమ్మిగ్రేషన్ ను ఇటీవల నిలిపివేయడంతో గ్రీన్ కార్డు కార్డు కోసం ఎదురు చూస్తున్నవారికి రెండు నెలల సమయం దొరికింది. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా, వీరిలో హెచ్-1బి వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు.

శుక్రవారం నాటి యుఎస్‌సీఐఎస్ ఉత్తర్వుల ప్రకారం హెచ్-1బి వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు కొనసాగింపు వీసా(ఎన్-14), తిరస్కరించే నోటీసులు, ఉపసంహరించుకునే నోటీసు, ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగించే నోటీసులు, ఫారం ఐ-290బి నోటీస్ ఆఫ్ అప్పీల్ లేదా మోషన్ తదితర అంశాలకు సంబంధించిన వాటిని 60 రోజుల్లోగా సమర్పించాలని సూచించింది. అభ్యర్థనలు, నోటీసుల విషయంలో చర్యలు తీసుకోవడానికి ముందు 60 రోజులలోగా స్పందించాలని తెలిపింది.

 

Huge relief to H1B
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News