Sunday, April 28, 2024

‘హంట్’లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్షిప్ ఉంటాయి – భరత్

- Advertisement -
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రలో నటించారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు. ఇందులో ఆయనది పోలీస్ రోల్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో ముచ్చటించారు.

బాయ్స్, ప్రేమిస్తే, యువసేన చిత్రాలతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు మీరు మరి తెలుగు చిత్రాల్లో నటించడానికి ఎందుకింత గ్యాప్ తీసుకున్నారని అడగగా భరత్ మాట్లాడుతూ నా మెయిన్ స్ట్రీమ్ తమిళ్ అందుకే అక్కడి సినిమాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశా అంటు చెప్పుకొచ్చారు. వరుసగా అవకాశాలు రావడంతో తమిళ సినిమాలతో బిజీగా ఉన్నానని అన్నారు. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశాను, పైగా సుధీర్ బాబు నాకు మంచి ఫ్రెండ్ అని సీసీఎల్ లో ఇద్దరం కలిసి క్రికెట్ మ్యాచులు కూడా ఆడామని తెలిపారు. శ్రీకాంత్ కూడా సీసీఎల్ వల్ల కాస్త క్లోజ్ అని అందుకే అన్నీ కుదిరి ఈ సినిమా ఓకే చేశానని తెలిపారు.

కథ మా ముగ్గురి (భరత్, శ్రీకాంత్, సుధీర్ బాబు) చుట్టూ తిరుగుతుందని, ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించారని, తను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చారని, హంట్’లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయని పేర్కొన్నారు. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.

కోలీవుడ్ పరంగా సంతృప్తిగానే ఉన్నానని , ఇండస్ట్రీలో మన ప్లేస్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అందుకే నటుడిగా ఫ్లాపులు, హిట్లతో కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నా అని తెలిపారు. అయితే, ప్రతి మూవీ ప్రాసెస్ ను ఎంజాయ్ చేస్తూ వస్తున్నా ఒక నటుడిగా అదే తనకు ఇంపార్టెంట్ అని చెప్పారు.

తమిళ్, తెలుగు, మళయాళం… ఇలా మూడు భాషల్లోనూ నటిస్తున్నారు, వీటిల్లో మిగతా ఇండస్ట్రీలకీ, టాలీవుడ్ కి ఎలాంటి తేడాలు ఫీలయ్యారు అని అడగగా స్టార్ట్, కెమెరా, యాక్షన్… ఏ భాష అయినా, ఏ ఇండస్ట్రీ అయినా అంతే, తేడాలంటూ ఏమీ పెద్దగా ఉండవని కానీ, గత అయిదారేళ్లుగా తెలుగు సినిమాల స్కోప్, మార్కెట్ పెరిగిందని తెలిపారు. సరికొత్త కంటెంటుతో లార్జన్ దేన్ లైఫ్ కథలు వస్తున్నాయని, ఎట్ ది సేమ్ టైమ్… ఇక్కడ సినిమాలు మిగతా సౌత్ భాషల్లో, అక్కడి సినిమాలు ఇక్కడా రీమేక్ అవుతున్నాయని, ఒక ఇండస్ట్రీలో విజయవంతమైన చిత్రాలను మరో ఇండస్ట్రీ రీమేక్ చేస్తున్నదని చెప్పుకొచ్చారు.

తమిళ్ మూవీ కాళిదాసులో నా లుక్ చూసి డైరెక్టర్ మహేష్ ఈ మూవీలోనూ అలానే ఉండాలనుకున్నారు. ఆ సినిమా హిట్ కాబట్టి సెంటిమెంట్ కూడా వర్కవుటవుతుందని అదే లుక్‌తో నటించానని, కథ ప్రధానంగా హైదరాబాద్ లోనే నడుస్తుందని, కొన్ని యాక్షన్ పార్ట్స్ హైదరాబాద్ సహా పారిస్ లో కూడా షూట్ చేశామని, కథకు సూటయ్యేలా, స్క్రీన్ ప్లేకు కనెక్టయ్యేలా యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారని అన్నారు.

ఖర్చుకు వెనుకాడకుండా భవ్య క్రియేషన్ చాలా లావిష్, రిచ్‌గా ఫిల్మ్ తీశారని, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను తీసుకు వచ్చారని. ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని ఆలోచించే నిర్మాత ఆయన అని వివరించారు.

అందరూ యాక్షన్, ఎమోషనల్ అండ్ రొమాంటిక్ స్క్రిప్ట్సుతోనే తనని అప్రోచ్ అవుతున్నారని, కానీ  పూర్తి స్థాయిలో ఓ కామెడీ మూవీలో నటించాలనుందని అన్నారు. తను ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు, నేనసలు చేయగలనా? లేదా? అన్న సందేహం కూడా తీరినట్టుంటుందని, ఒక కంప్లీట్ రా ఏజెంట్ గా కూడా నటించాలనుందని అలాంటి కథలొస్తే కచ్చితంగా చేస్తానని తెలిపారు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్.. వీళ్ల డైరెక్షనంటే బాగా ఇష్టమని, అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమాలో నటించాలనుందని. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను నటుడిగా ఆయనంటే ఇష్టమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News