Saturday, April 27, 2024

ఇక హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ సిటీ

- Advertisement -
- Advertisement -

Hyderabad is now a traffic free city with new projects

 రూ.29280.63 కోట్లతో 48 ప్రాజెక్టులు
ఇప్పటికే పూరైన 18 ప్రాజెక్టులు
వివిధ దశలో మరో రూ. 6వేల కోట్ల పనులు

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా ట్రాఫిక్ సిటీ మార్చడమే లక్షంగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డిపి) కింద అభివృద్ధి పనులు శర వేగంగా ముందుకు సాగుతున్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రయాణ సౌకర్యం కల్పించడమే లక్షంగా ప్రభుత్వం వివిధ విభాగాల ద్వారా మొత్తం రూ.29,280.63 కోట్లతో 48 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా అత్యంత రద్దీ ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, బాచ్‌పల్లి, పటన్ చెరువు, అబిడ్స్, చార్మినార్, ఎల్‌బినగర్, చంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఉప్పల్, సికింద్రాబాద్, ఇసిఐల్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల రోడ్ల అభివృద్ధితో పాటు పలు ప్రాజెక్టులను చేపట్టింది.

ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో 135 కిలో మీటర్ల మేర 7 స్వైవేలు, 166 కిలో మీటర్ల మేజర్ కారిడార్స్, 348 కిలోమీటర్లు, ప్రధాన రోడ్లు, 1400కిలో మీటర్ల మేర ఇతర రోడ్ల నిర్మాణంతో పాటు 54 గ్రేడ్ సఫరేటర్స్ పనులను చేపట్టింది. ఈ 48 ప్రాజెక్టులో ఇప్పటీకే 18 ప్రాజెక్టులు 9ప్లై ఓవర్లు, 4 అండర్ పాస్‌లు, 3 ఆర్‌యుబీలు, ఒక వంతెనతో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలు పూరైయ్యాయి. ఇందులో ఎల్‌బినగర్, బైరామల్ గూడ, కామినేని ప్రాంతాల్లో 4ప్లైఓవర్లతో పాటు రెండు అండర్ పాస్ మార్గాలు, అదేవిధంగా బయోడైవర్సీటీ ప్లై ఓవర్ తదితర 16 ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి రాగా, మరో రెండు ఒక వంతెనతో పాటు కేబుల్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం కానున్నాయి. అదే విధంగా మరోరూ. 6వేల కోట్ల విలువైన అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News