Saturday, April 27, 2024

తొలి వ్యాక్సిన్ నేనే తీసుకుంటా : మంత్రి ఈటల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తొలి కరోనా వ్యాక్సిన్ తానే తీసుకుంటానని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. నిమ్స్‌లో ఆధునికీకరించిన క్యాన్సర్ విభాగాన్ని మంత్రి ఈటల శనివారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండో దశ డ్రై రన్ సక్సెస్ అయ్యిందన్నారు. టీకా ఎప్పుడు పంపినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరించారు. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్షంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో భయపడాల్సిన పని లేదన్నారు.

బర్డ్ ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని, బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి ఈటల అన్నారు. వైద్య ఖర్చులు ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించలేమన్నారు. ఈహెచ్‌ఎస్, ఆరోగ్యశ్రీ కింద రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నామని, వైద్య రంగంపై రూ.7,500 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. రూ.450 కోట్లతో నిమ్స్ అభివృద్ధి, సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు.

వైద్య రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. క్యాన్సర్ విభాగం ఆధునికీకరణకు మేఘా సంస్థ రూ.18 కోట్లు అందించిదని అన్నారు. నిజాం కాలం నాడే పేద ప్రజల కోసం నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ నిర్మాణం జరిగిందని తెలిపారు. ఆనాడు పేదలకు వైద్యం అందుబాటులో లేని రోజుల్లో ఎంతో మందికి నిమ్స్ వైద్యం అందించిందన్నారు. చాలా సంస్థలు సిఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) కింద హాస్పిటల్స్‌ను అభి వృద్ధి చేస్తున్నా రన్నారు.

పేదవారందరికి ఉచితంగా వైద్యం పూర్తిస్థాయిలో అందించే స్థాయికి తెలంగాణ ఎదగాలని కోరుకుంటున్నానని మంత్రి ఈటల తెలి పారు. నిమ్స్‌కు పూర్వవైభవం తీసుకురావాలని 450 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్స్ నిర్మాణం చేయబోతున్నామన్నారు. ఇందు నిమిత్తం అన్ని విభాగాల అధిపతులతో చర్చించినట్లు వెల్లడించారు. జనవరి 11న సిఎంతో మీటింగ్ ఉందని, కరోనా వ్యాక్సిన్ మీద చర్చించబోతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో మేఘా సంస్థ చైర్మన్ పి.పి.రెడ్డి, డైరెక్టర్ సుధారెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News