Monday, April 29, 2024

భారత్‌-సౌతాఫ్రికా రెండో టి20.. కుర్రాళ్ల జోరు కొనసాగేనా?

- Advertisement -
- Advertisement -

గెబెహరా: భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టి20 జరగనుంది. గెబెహరాలోని సెయింట్‌జార్జ్ పార్క్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలని ఇరు జట్ల భావిస్తున్నాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టి20 వర్షం వల్ల కనీసం టాస్ కూడా పడకుండానే రద్దుయ్యింది.

ఆత్మవిశ్వాసంతో..
ఈ మ్యాచ్‌కు యువ భారత్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, జడేజా, రింకు సింగ్, తిలక్‌వర్మ, శ్రేయస్ అయ్యర్, జితేష్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రుతురాజ్, యశస్వి జైస్వాల్ తదితరులు అద్భుత ఆటను కనబరిచారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో శుభ్‌మన్ గిల్ చేరడంతో జట్టు బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారింది. అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్, కుల్దీప్, జడేజాలతో బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉంది.

రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆతిథ్య సౌతాఫ్రికా కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సఫారీ టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ మార్‌క్రమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కేశవ్ మహారాజ్, తబ్రేస్ షంసి, కొయెట్జీ, మార్కొ జాన్సెన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News