Saturday, April 27, 2024

ఫైనల్లో యువ భారత్

- Advertisement -
- Advertisement -

బెనోని: అండర్19 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ మరో ఏడు బంతులు మిగిలివుండగానే 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఆదుకున్న ఉదయ్, సచిన్
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (0) ఔటయ్యాడు. క్వెనా మపకా ఈ వికెట్ తీశాడు. కొద్ది సేపటికే ముషీర్ ఖాన్ (4) కూడా ఔటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (12), ప్రియాన్షు మోలియా (5) కూడా పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పెను కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ ఉదయ్ సహరన్, సచిన్ దాస్‌లు తమపై వేసుకున్నారు. ఇద్దరు సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య టీమ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇద్దరు కుదురుగా ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన సచిన్ దాస్ 95 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 96 పరుగులు సాధించాడు. ఇదే క్రమంలో ఉదయ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించాడు. ఆ తర్వాత భారత్ కాస్త ఒత్తిడికి గురైనా కెప్టెన్ ఉదయ్ జట్టుకు అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన ఉదయ్ 6 ఫోర్లతో 81 పరుగులు చేశాడు. చివర్లో రాజ్ లింబాని 13 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు తొలుత బాయటింగ్ చేసిన సౌతాఫ్రికాను ఓపెనర్ ప్రెటోరియస్ (76), రిచర్డ్ (64) ఆదుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News