Saturday, May 11, 2024

భారత్ మాకు మంచి మిత్రదేశం

- Advertisement -
- Advertisement -

మాల్దీవుల పర్యాటక పరిశ్రమ ప్రకటన

మాలె: మాల్దీవులకు, ఇండియాకు మధ్య వివాదం రాజకున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని, భారత ప్రజలను కించపరుస్తూ తమ దేశ మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలను మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ(మాటి) మంగళవారం ఖండించింది. పర్యాటకంపై ఆధారపడిన మాల్దీవులకు భారత్ అత్యంత సన్నిహితమైన పొరుగున ఉన్న మిత్ర దేశాలలో ఒకటని మాటి ఒక ప్రకటనలో తెలిపింది. మాల్దీవులు కష్టకాలంలో ఉన్నపుడు అందరికన్నా ముందుగా స్పందించిన చరిత్ర భారత్‌కు ఉందని తెలిపింది.

తమతో భారత ప్రభుత్వం, భారత ప్రజలు అత్యంత సన్నిహిత స్నేహబాంధవ్యాలు కొనసాగిస్తున్నందుకు తాము ఎంతో రుణపడి ఉన్నామని మాటి పేర్కొంది. మాల్దీవుల పర్యాటకాభివృద్ధికి భారత్ అందచేస్తున్న అపారమైనదని, కొవిడ్ 19 మహమ్మారి కాలంలో సరిహద్దులు తెరుచుకున్న తర్వాత మాల్దీవులు కోలుకోవడానికి భారత్ ఎంతో సాయం చేసిందని మాటి పేర్కొంది. నాటి నుంచి మాల్దీవులకు అగ్రశ్రేణి మార్కెట్లలో ఒకటిగా భారత్ కొనసాగుతోందని తెలిపింది.

తమ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు తరతరాలుగా కొనసాగాలన్నదే తమ ఆకాంక్షని, తమ మధ్య స్నేహసంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే ఎటువంటి చర్యలు, ప్రసంగాలు తాము చేయబోమని మాటి తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటటను పురస్కరించుకుని మాల్లీవులకు చెందని కొందరు క్యాబినెట్ మంత్రులు, అధికారులు చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో మాల్దీవుల పర్యాటక పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పరిస్థితులు నెలకొన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News