Saturday, April 27, 2024

రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి లక్షన్నర మంది మృతి

- Advertisement -
- Advertisement -

road accidents
న్యూఢిల్లీ: ప్రతి ఏడాది భారత్‌లో జరిగే రోడ్దు ప్రమాదాల్లో లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో మొత్తంగా జరిగే రోడ్దు ప్రమాదాలతో పోలిస్తే భారత్‌లో జరిగేవి 1 శాతం. గత కొన్ని సంవత్సరాల్లో స్వీడెన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో రోడ్డు భద్రత బాగా మెరుగయింది. అక్కడ చట్టం బాగా పకడ్బందీగా అమలవుతుంది. భారత్‌లో కూడా మోటారు వాహన సవరణ చట్టం,2019 ఆమోదించారు. అయితే వాస్తవంలో భారత్‌లో రోడ్డు భద్రత పరిస్థితి ఏమంత మెరుగ్గాలేదు. చాలా వరకు స్పీడు రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ కారణం అవుతోంది. తర్వాత మత్తు పానీయాలు త్రాగి నడపడం ద్వారా జరుగుతున్నవి, వాహనాలు అదుపు తప్పడం వంటి వాటివల్ల ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News