Saturday, May 4, 2024

భారత్ తొలి ఇన్నింగ్స్ 257/6

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ముగిసి సమయానికి భారత్ 74 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 321 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. పంత్, పుజారా హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఐదు వికెట్‌పై పుజారా, పంత్ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(33), రవించంద్రన్ అశ్విన్(08) పరుగులు చేశారు. భారత్ బ్యాట్స్‌మెన్లలో రిషబ్ పంత్ (91), ఛటేశ్వరా పుజారా(73), శుభ్‌మన్ గిల్(29), విరాట్ కోహ్లీ(11), రోహిత్ శర్మ(06), అజింక్య రహానే(01) పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డొమినిక్ బెస్ నాలుగు వికెట్లు పడగొట్టగా జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 578

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News