Monday, April 29, 2024

ఉత్తరాఖండ్ నుంచి మొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ : సిందియా

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : దేశం లోనే మొట్టమొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ (హెచ్ ఇ ఎం ఎస్) ఉత్తరాఖండ్ నుంచి ప్రారంభించడమౌతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా గురువారం వెల్లడించారు. ఈ మేరకు తన ఎక్స్ నుంచి వీడియో షేర్ చేశారు.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్) అజమాయిషీలో ఈ సర్వీస్ ఉంటుందని, అక్కడ నుంచి 150 కిమీ పరిధిలో ఎక్కడికైనా అత్యవసర వైద్య సహాయం కోసం పంపడమౌతుందని తెలిపారు. ఎవరైనా ప్రమాదానికి గురైతే ఆ వ్యక్తిని ఈ హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్యానికి తరలించడమౌతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News