Monday, April 29, 2024

భారత్ @107

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ : చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసా రి ఆసియా గేమ్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలను గెలుచుకుంది. ఈ క్రమంలో 70 పతకాల పాత రికార్డును తిరగరాసింది. శనివారం 14వ రోజు భారత్ ఏకంగా 12 పతకాల ను భారత్ గెలుచుకుంది. ఇందులో రికార్డు స్థాయిలో ఆరు స్వర్ణ పతకాలు ఉండడం విశేషం. దీంతో పాటు ఆర్చరీ, చెస్, రెజ్లింగ్‌లలో భారత్ రజతాలను సాధించింది. క్రికెట్, కబడ్డీ, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌లలో భారత్‌కు స్వర్ణ పతకా లు లభించాయి. కబడ్డీలో భారత్ పురుషులు, మహిళల జట్లు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. ఆర్చరీలో పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జోడీ బంగారు పతకం గెలుచుకుంది.

ఆర్చరీలో తెలుగుతేజం జ్యోతి సురేఖ వెనం మహిళల వ్యక్తిగత కాంపౌం డ్ విభాగంలో పసిడి పతకాన్ని సాధించింది. పురుషుల క్రికెట్‌లో కూడా భారత్‌కు పసిడి లభి ంచింది. శనివారంతో ఆసియా క్రీడల్లో భారత పోరాటం ముగిసింది. పోటీలు ముగిసే సమయానికి భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాల ను గెలుచుకుంది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, మరో 41 కాంస్య పతకాలు ఉన్నా యి. ఆసియా క్రీడల్లో భారత పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆతిథ్య చైనా 382 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా 200 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్య పతకాల ను గెలుచుకుంది. జపాన్ 51 స్వర్ణాలు, 66 రజతాలు, 69 కాంస్య పతకాలతో రెండో, దక్షిణ కొరియా 42 స్వర్ణాలు, 59 రజతాలు, మరో 89 కాంస్యలతో మూడో స్థానంలో నిలిచింది.

కబడ్డీలో డబుల్ ధమాకా..
ఆసియా క్రీడల కబడీలో భారత్‌కు రెండు స్వర్ణాలు లభించాయి. శనివారం భారత పురుషులు, మహిళల జట్లు పసిడి పతకాలను గెలుచుకున్నాయి. మహిళల టీమ్ ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక పురుషుల జట్టు పటిష్టమైన ఇరాన్‌ను చిత్తు చేసి తన ఖాతాలో పసిడి పతకాన్ని జత చేసుకుంది. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు తన ఆధిపత్యాన్ని ఈసారి కూడా చాటింది. ఊహించినట్టే స్వర్ణం సాధించి తనకు ఎదురులేదని మరోసారి నిరూపించింది.
ఆర్చరీలో సురేఖకు పసిడి..
మహిళల ఆర్చరీలో భారత స్టార్, తెలుగుతేజం జ్యోతి సురేఖ వెనం మరోసారి సత్తా చాటింది. శనివారం జరిగిన ఫైనల్లో సురేఖ విజయం సాధించింది. అసాధారణ ఆటతో అలరించిన సురేఖ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. భారత్‌కు చెందిన మరో ఆర్చర్ అదితి గోపీచంద్‌కు కాంస్య పతకం లభించింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో ఓజాస్ ప్రవీణ్ డియోటేల్ పసిడి పతకం సాధించాడు. భారత్‌కే చెందిన అభిషేక్ వర్మతో జరిగిన ఫైనల్లో ఓజాస్ విజయం సాధించి స్వర్ణం దక్కించుకున్నాడు. అభిషేక్ సాధించిన రజతంతో భారత్ పతకాల సంఖ్య వందకు చేరింది.

చరిత్ర సృష్టించిన సాత్విక్ జోడీ..
పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఫైనల్లో సాత్విక్ జోడీ 2118, 2116 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన జంటపై విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత లేదా టీమ్ విభాగాల్లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక రెజ్లింగ్‌లో భారత్ కు చెందిన దీపక్ పునియా రజతం సాధించాడు. ఇరాన్ రెజ్లర్ యజ్దానీతో జరిగిన ఫైనల్లో దీపక్ ఓటమి పాలయ్యాడు. ఇక మహిళల హాకీలో భారత్‌కు కాంస్యం లభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 21తో గెలిచి కాంస్యం సొంతం చేసుకుంది.
చెస్‌లో రెండు పతకాలు..
చెస్‌లో కూడా భారత్ సత్తా చాటింది. మహిళలు, పురుషుల విభాగంలో భారత్‌కు రజత పతకాలు లభించాయి. మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక, సవితలతో కూడి భారత బృందం రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. పురుషుల విభాగంలో ప్రజ్ఞానంద, గుకేష్, విదిత్ గుజరాతి, అర్జున్, హరికృష్ణలతో కూడి బృందం రజతం దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News