Monday, April 29, 2024

భారత్‌కు భారీగా తగ్గిన ఆయుధాల దిగుమతులు

- Advertisement -
- Advertisement -

India's arms imports drop by 33%: SIPRI report

 

న్యూఢిల్లీ : దేశంలో ఆయుధాల దిగుమతులు బాగా తగ్గాయి. ముఖ్యంగా ఆయుధాల కోసం ఇతర రక్షణ సామగ్రి కోసం రష్యా వంటి దేశాలపై ఆధారపడడం బాగా తగ్గిందని అంతర్జాతీయ ఆయుధాల రవాణాకు సంబంధించిన నివేదిక వెల్లడించింది. 2011-15,2016-20 మధ్యకాలంలో భారత్‌కు ఆయుధాల దిగుమతులు 33శాతం వరకు తగ్గిందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సిప్రి) సోమవారం వెల్లడించింది. అమెరికా నుంచి భారత్‌కు ఆయుధాల దిగుమతులు 46 శాతం వరకు తగ్గినప్పటికీ రష్యాపై ఈ ప్రభావం చాలావరకు కనిపించింది. 2016-20 లో రష్యా నుంచి భారత్‌కు ఎగుమతులు 20 శాతం ఉండగా, అవి 22 శాతం వరకు తగ్గాయని నివేదిక వివరించింది. అలాగే అదే కాలంలో చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 7.8 శాతం తగ్గాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News