Saturday, April 27, 2024

భయం వద్దు.. జాగ్రత్తలు చాలు

- Advertisement -
- Advertisement -

coronavirus

 

కరోనా వైరస్‌పై ఉదాసీనత తగదు

కరోనా వైరస్ వ్యాప్తిపై టెలివిజన్‌లు ఎంత చూపిస్తున్నాయో, ఎలా చూపిస్తున్నాయో పరిశీలిస్తే తెలుగు టీవీ ఛానళ్ళు సహజంగానే ఎక్కువ చూపిస్తున్నాయని మనకి అనిపించవచ్చు కానీప్రమాద తీవ్రత అర్ధం చేసుకోవాలంటే మిగతా దేశాలవాళ్ళు ఈ అంశాన్ని ఎలా ఎదుర్కొంటున్నారో, అక్కడి మీడియా ఎలా రిపోర్ట్ చేస్తోందో చూడాలి. జర్మన్ ఛాన్సలర్ మెర్కెల్ ఈ సమస్య తీవ్రత గురించి మాట్లాడారు. సింగపూర్ ప్రధాని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కెనడా ప్రధాని భార్యకు కరోనా వైరస్ సోకడంతో ఇద్దరినీ పర్యవేక్షణలో ఉంచారు.

చాలామంది కరోనా వల్ల కలిగే మరణాల రేటు చాలా తక్కువ అనీ, దానికంటే ఇతర వ్యాధుల వల్ల, రోడ్డు ప్రమాదాలలో అనేక రెట్లు ఎక్కువమంది చనిపోతున్నారని అంటున్నారు. కానీ ఇది సరైన పోలిక కాదు. అయితే టీబీ, గుండెజబ్బులు, కేన్సర్లు, రోడ్డు ప్రమాదాల్లో — లక్షల మంది చనిపోతున్నారన్నది వాస్తవం. కానీ, ఈ వాదన పెట్టి కరోనా వల్ల కలుగుతున్న నష్టాన్ని తక్కువ చెయ్యలేం. మరణాల రేటు తక్కువ శాతం అని అనుకోరాదు కానీ, సంఖ్యలెప్పుడూ పూర్తి కథను చెప్పవు.

ఇంత పెద్ద దేశంలో ఒక్క శాతం మందికి (ఉదా: ఒక కోటి మందికి) వచ్చినా ఉపద్రవం ఎంత తీవ్రంగా ఉండబోతోందో ఊహించండి. ఇటీవల బెంగళూర్ కి చెందిన ఒక ఇంజనీర్ కి కరోనా వైరస్ సోకింది. కొన్ని రోజులకి బయటపడింది. కాంటాక్ట్ – ట్రేసింగ్ (ఆయన ఎవరెవరితో దగ్గరగా మెలిగి ఉంటాడు. అలా ఆయనతో దగ్గరగా మెలిగిన వాళ్ళు ఎవరెవరితో దగ్గరగా మెలిగివుంటారు… అని విశ్లేషిస్తారు. ) చేస్తే దాదాపు రెండున్నరవేల మంది ఆ లిస్టులో తేలారు.

అలాగే, దేశంలో కరోనా తో చనిపోయిన మొదటి వ్యక్తి 34 మందితో కలిసి ఉంటారని తేల్చి వాళ్లందరినీ పర్యవేక్షణలో ఉంచి, సాంపిల్స్ తీసుకుని పరీక్షలు జరిపారు. ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పేనంటే, కరోనా వైరస్ చాలా వేగంగా ఎక్కువమందికి అంటుకుంటుంది. ఒక అంచనా ప్రకారం, ప్రతీ వారం ఈ వైరస్ బారిన పడుతున్నవాళ్ళ సంఖ్య రెట్టింపవుతున్నదీ ప్రపంచ వ్యాప్తంగా వుంది.ఈ వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది. రోజుల వ్యవధిలోనే విజృంభిస్తుంది. అరవై ఏళ్లలోపు వున్న వాళ్లకు దీనివల్ల ప్రాణహాని పెద్దగా ఉండదు.

ప్రత్యేక పరిస్థితులు
కానీ, సమస్య ఎక్కడ వస్తుందంటే — మన దేశంలోని ప్రత్యేక పరిస్థితులు. రెండో అతి పెద్ద జనాభా గల దేశం మనది. విపరీతమైన సాంద్రత గల నగరాలు, బస్తీల్లో బతుకుతున్నాం. ముంబై, కలకత్తా, ఢిల్లీ, బెంగళూరు లాటి మెట్రో పట్టణాల్లో ప్రజారవాణా అంతా కిక్కిరిసిన బస్సులపై, రైళ్లపై ఆధారపడి ఉంటుంది. కరోనా వైరస్ చాలా సులభంగా వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మనుషులు దగ్గరగా వచ్చినపుడు, వాళ్ళు తాకిన వస్తువులను తాకినప్పుడు క్షణాల్లో అవతలి వాళ్లకు వ్యాపిస్తుంది.

వాహకులు కొందరికి, ముఖ్యంగా పదేళ్ల లోపు పిల్లకి, ఈ వ్యాధి వల్ల ప్రమాదం లేదు. కానీ ఈ వైరస్ కి వాళ్ళు వాహకులుగా వుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి వైరస్ ని తమకు తెలీకుండానే తీసుకెళ్తారు. అంటిస్తారు.
4ప్రపంచంలో జనవరి 22 న మొదటి కేసు రికార్డయితే మార్చి 10 నాటికి లక్షా ఇరవై ఐదువేలకి చేరుకుంది.మూడునెలల్లో కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ప్రపంచంలో (చైనా మినహా) ఫిబ్రవరి 21 నాటికి కేసుల సంఖ్య కేవలం రెండువేలలోపే. అంటే కేవలం రెండు వారాల్లోనే (చైనా మినహా) ప్రపంచంలో (ప్రధానంగా ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ దేశాల్లో) కేసుల సంఖ్య రెండువేల నుంచి లక్షా పాతికవేలకు చేరుకుంది.

4జనవరి 22న రిపోర్ట్ అయిన కేసులు వంద ఉంటే రిపోర్ట్ కాని కేసులు 1,500 ఉన్నాయని (ఫుట్ నోట్స్ లోని ’మీడియం’ ఆర్టికల్) అంచనా. నాలుగువందల కేసులు వచ్చిన రోజున చైనా ప్రభుత్వం వుహాన్ నగరాన్ని మూసివేసింది. నిజానికి ఆరోజు రెండున్నరవేలు కేసులున్నాయిని వాళ్లకు తర్వాత తెలిసింది. విజృంభించే లక్షణం చాలా వుంది కాబట్టి, చాలా తక్కువమందికే ప్రమాదం అయినా — మన జనాభా చాలా ఎక్కువ కాబట్టి నష్టం అనూహ్యంగా ఉంటుంది.

భయమా? జాగ్రత్తనా?
ఎంత భయపడాలి? ఇది క్లిష్టమైన ప్రశ్న. ప్రపంచానికి ఇటువంటి పెను సమస్య ఇంతకు ముందు రాలేదు. భారత దేశంలో వైద్య సేవలు అంతంత మాత్రమే. తమిళనాడు, కేరళ లాటి రాష్ట్రాలలో తప్ప ప్రాథమిక, సెకండరీ, ఇతర ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు సరిపడా లేవు. వైరస్ సోకిన అందరికీ ప్రమాదం లేదు. కానీ సోకిన వారికి వెంటిలేటర్లు కూడా అవసరమవుతాయి – న్యుమోనియా రావడం వల్ల. ఈ సౌకర్యాలు పెద్ద నగరాల్లోనే అంతంత మాత్రంగా వున్నాయి. చిన్న పట్టణాలు, గ్రామాల్లో మృగ్యం.

వైద్య సౌకర్యాలు సరిపోవు..
మన దేశ జనాభా ఎక్కువ. తక్కువ ప్రదేశంలో ఎక్కువమంది నివసిస్తుంటారు . ఈ వైరస్ కి త్వరగా వ్యాప్తి చెందే లక్షణం వుంది కాబట్టి, మన దగ్గర వైద్య సౌకర్యాలు చాలా తక్కువ వున్నాయి . అందువల్ల — మనం ఈ సమస్య గురించి కొంచెం తీవ్రంగానే పట్టించుకోవాలి. సమస్య తీవ్రతకు తగ్గట్టు మనం స్పందిస్తున్నామో లేదా అని చూసుకుంటే మీడియా ఎంత మేర చూపిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. సరైన సమాచారం మన దగ్గర ఉంటే అనవసర సమాచార ప్రవాహంలో కొట్టుకుపోకుండా, భయాలకు లోను కాకుండా ఉండొచ్చు.
కె.వి. కూర్మనాధ్ (కోరా) సోషల్ మీడియా

మరికొన్ని జాగ్రత్తలు..
1) తలుపుల హ్యాండిల్స్‌ని తరచూ శుభ్రం చెయ్యండి (సబ్బు, ఫినాయిల్, డెట్టాల్ లతో).
2) లిఫ్ట్ తలుపులు ముట్టుకున్నాక, కార్ల హ్యాండి ల్స్ పట్టుకున్నాక, మెట్లు దిగేటప్పుడు గోడలు పట్టుకున్నాక, హోటళ్లలో పార్సెల్స్ పెట్టుకున్నాక, కంప్యూటర్లు వాడాక — చేతులు కడుక్కోండి. కడుక్కోకుండా – కళ్ళని, ముక్కుని, నోటిని తాకకండి.
3) మనం ఎక్కువగా తాకే ప్రదేశాల్ని, వస్తువుల్ని తరచూ శుభ్రం చెయ్యాలి. వాటిని తాకితే చేతులు శుభ్రం చేసుకోవాలి.
4) వాయిదా వేయగలిగిన ప్రయాణాలన్నీ, సమూ హాల్ని వాయిదావెయ్యండి.
5) మాల్స్, సినిమాలు, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్ కొన్నాళ్లు మానెయ్యండి.
6) వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటేనే ఎక్కువ క్షేమం.

Indifference to coronavirus is not tolerated
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News