Monday, April 29, 2024

ఈనెల 20న ఓయూ లో… ‘ఇన్ స్పైర్ 2023‘ సివిల్ సర్వీసెస్ విజేతలతో ముఖాముఖి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కుటుంబ నేపథ్యం ఏదైనా పట్టుదల, వ్యూహం ఉంటే సివిల్ సర్వీసస్ సాధించటం సాధ్యమేనని నిరూపించిన ‘సివిల్ సర్వీసెస్, 2022‘ విజేతలతో బిసి సంక్షేమ శాఖ, బిసి స్టడీ సర్కిల్, ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ‘ఇన్ స్పైర్ 2023‘ పేరుతో ఈ నెల 20న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా, ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండిబోయిన రవిందర్ యాదవ్ గౌరవ అతిధిగా హాజరు కానున్నారని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

సివిల్స్ సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా విద్యార్థులతో పంచుకుంటారని ఆయనన్నారు. ఈ కార్యక్రమాన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారందరితో పాటు ఉస్మానియా విద్యార్థులంతా వినియోగించుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు బిసి స్టడీ సర్కిల్ అండగా ఉంటుందని, వీరి కోసం ఇప్పటికే సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్ శిక్షణ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News