Monday, April 29, 2024

ఆధార్‌తో తక్షణమే ఇ-పాన్

- Advertisement -
- Advertisement -
pan card
ఈ నెలలోనే ప్రారంభం : రెవెన్యూ కార్యదర్శి అజయ్ పాండే

న్యూఢిల్లీ: ఆధార్ వివరాలను అందజేస్తే తక్షణమే ఆన్‌లైన్ ఇపాన్ కార్డు ను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ఈ నెలలోనే ప్రారంభించనుందని రెవెన్యూ కార్యద ర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. బడ్జెట్ 20202లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం, ఎలాంటి ఫారంలను నింపకుండానే ఆధార వివరాలతో తక్షణమే పాన్(శాశ్వత ఖాతా సంఖ్య)ను ఆన్‌లైన్ ద్వారా కేటాయించనున్నారు.

పాన్ కార్డు ప్రక్రియను వేగవంతం చేసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎప్పుడు ఈ విధానం ప్రారంభిస్తారని ప్రశ్నించినప్పుడు పాండే సమాధానమిస్తూ, అంతా సిద్ధం చేశామని, ఈ నెలలోనే ప్రారంభిస్తామని అన్నారు. ఆదాయం పన్ను వెబ్‌సైట్ ద్వారా పాన్ పొందవచ్చని తెలిపారు. ఆధార్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఒటిపి(వన్ టైమ్ పాస్‌వర్డ్) పంపుతారు. ఒటిపితో ఆధార్ వివరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత పాన్‌ను కేటాయిస్తారు. దీంతో ఇపాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన వివరించారు.

 

Instant allotment of E PAN based on Aadhaar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News