Sunday, April 28, 2024

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం

- Advertisement -
- Advertisement -

International Arbitration Center in Hyderabad

 

హైదారాబాద్‌లో ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం

ట్రస్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా
పాల్గొన్న సిజెఐ ఎన్‌వి.రమణ రాష్ట్ర హైకోర్టు సిజె
హిమాకోహ్లి ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సుప్రీం
జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, మంత్రులు కెటిఆర్,
ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఆరిట్రేషన్ కేంద్రానికి
సహకరించినందుకు సిఎం కెసిఆర్, కెటిఆర్‌లకు కృతజ్ఞతలు
తెలిపిన జస్టిస్ ఎన్‌వి.రమణ ఫైనాన్షియల్ జిల్లా
ప్రాంతంలో స్థలం కేటాయించాలని విజ్ఞప్తి సెంటర్
ఏర్పాటులో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ఏర్పాటుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లోని అశోక్ విహార్ (తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసం)లో శుక్రవారం నాడు జరిగిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రం ట్రస్ట్ రిజిష్ట్రేషన్ డీడ్ కార్యక్రమంలో జస్టిస్ రమణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను హైదరాబాద్‌లో జడ్జి పనిచేసిన సమయంలో నల్సార్‌లో జరిగిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి 10 ఎకరాల భూమి, రూ. 25 కోట్లు రూపాయలు కేటాయించారని, అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా కార్యరూపందాల్చలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు ఫైనాన్సియల్ జిల్లా ప్రాంతంలో కొంత భూమిని కేటాయించాల్సిందిగా కోరామన్నారు.

ఈ నేపథ్యంలో జూన్ నెలలో తాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా భాధ్యతలు తీసుకున్నాక హైదరాబాద్ వచ్చిన సమయంలో చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం కొరకు ప్రతిపాదనలు పంపించాలని కోరానన్నారు. దీంతో వారు జూన్ 30, 2021 తేదీలోగా ఆర్బిట్రేషన్ కేంద్రం పై ప్రతిపాదనలు సమర్పించారని, ఈక్రమంలో ఇదే విషయంపై పరిశ్రమల ముఖ్య కార్యదర్శి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి లు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావుతో తాను పలుమార్లు చర్చించారన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రం రిజిష్ట్రేషన్ డీడ్ కార్యక్రమం కార్యరూరం 3 నెలలలో సాకారమైనందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, చీఫ్ జస్టిస్ అఫ్ తెలంగాణ హిమా కోహ్లీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. భారత దేశంలో ఆర్ధిక సంస్కరణలకు పితామహుడైన తెలంగాణ బిడ్డ పి.వి.నర్సింహా రావు నాయకత్వంలో 1995 సంవత్సరంలో ఆర్ధిక సంస్కరణలు ప్రాంరంభమయ్యాయన్నారు. ఇతర దేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఇక్కడ పెట్టుబడి పెట్టాలని తాను అడిగితే వారు పెట్టుబడి పెట్టడానికి సిద్దమే కాని ఇక్కడ లిటిగేషన్లు ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని బయపడుతున్నట్లు చెప్పారన్నారు. 1996 సంవత్సరంలో ఆర్బిట్రేషన్ చట్టం చేయటం జరిగిందని దీని ద్వారా ఆర్బిట్రేషన్ ప్రక్రియ వేగవంతమయిందన్నారు.

ఆర్బిట్రేషన్ కేంద్రం మొదట 1926 సంవత్సరంలో పారిస్ లో ప్రారంభమయిందని తరువాత నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ మధ్యనే దుబాయ్ లో ప్రారంభమయిందని త్వరలో హైదరాబాద్ లో అమలులోకి రావడం ఆనందదాయకమన్నారు. హైదరాబాద్ లోని పరిస్థితులు ఈ కేంద్రం ఏర్పాటుకు చాలా అనుకూలమని ఇక్కడ వాతావరణం, సంసృతి, సాంకేతిక లభ్యత మొదలైనవి ఇందుకు దోహదపడుతాయన్నారు. ముఖ్యమంత్రి ఈ కేంద్రం ఏర్పాటు కు కావాల్సిన మౌళిక సదుపాయాలు, ఆర్ధిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మొదటి ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందుకు గాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణకు ధన్యవాదాలన్నారు. సింగపూర్, దుబాయ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్‌లను చూసిన సిజెఐ భారత్‌లోఉండాలని వెంటనే స్పందించడం అద్భుతమన్నారు.

ఈ సెంటర్‌లో త్వరలోనే పనులు ప్రారంభం కావాలని కోరుకుంటున్నానని, అది మీ చేతులమీదగానే జరగాలని, అందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి వేదికగా ఆర్బిట్రేషన్ కేంద్రం ఉండటం వల్ల పలు వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు.ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు జడ్జి సుప్రీం కోర్టు , జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్, ఫార్మర్ జడ్జి సుప్రీం కోర్టు, చీఫ్ జస్టిస్ అఫ్ తెలంగాణ హిమా కోహ్లీ, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్ అఫ్ హైకోర్టు, రిజిస్ట్రార్స్ అఫ్ హైకోర్టు, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ , న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిజెఐ మూడు రోజుల పర్యటన

మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రం రిజిష్ట్రేషన్ డీడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జస్టిస్ ఎన్‌వీ రమణ గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నగరానికి సిజెఐ సోమవారం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News