Sunday, April 28, 2024

అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

International level development of Secunderabad Railway Station

సుమారు రూ.653 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ల పిలుపు
వాణిజ్య సముదాయాలతో పాటు హోటళ్లు, థియేటర్ల నిర్మాణం
36 నెలల్లో నిర్మాణాలు పూర్తి
రెండోవిడతలో మరిన్ని స్టేషన్‌ల అభివృద్ధి

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. సుమారు రూ.653 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో రీ డెవలప్‌మెంట్ రైల్వే శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే టెండర్‌లను సైతం పిలిచింది. టెండర్‌లు ఖరారు కాగానే సుమారుగా 36 నెలల్లో వాణిజ్య సముదాయాలతో పాటు మాల్స్, థియేటర్లు, హోటళ్ల నిర్మాణం జరగనుంది. టెండరు ప్రక్రియ ప్రారంభం కావడంతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. సికింద్రాబాద్‌తో పాటు తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధికి కూడా రైల్వే శాఖ టెండర్‌లను పిలిచింది. వీటి అభివృద్ధి అనంతరం మరిన్ని ముఖ్యమైన స్టేషన్‌ల రీ డెవలప్‌మెంట్ జరగనుంది.

ఈనెల 21వ తేదీన ప్రీ బిడ్ సమావేశం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దక్షిణమధ్య రైల్వేలోనే కాకుండా భారతీయ రైల్వేలోని రద్దీ స్టేషన్లో ఒకటి. రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి వసతులతో తీర్చిదిద్దాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించిన నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి సుమారు రూ.653 కోట్ల అంచనా వ్యయంతో దక్షిణమధ్య రైల్వే అధికారులు టెండర్‌లను పిలిచారు. దీనికి సంబంధించి ఈనెల 21వ తేదీన ప్రీ బిడ్ సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేస్తుండగా వచ్చేనెల 29వ తేదీన ఈ ప్రాజెక్టును ఈపిసి విధానంలో నిర్మించనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయి ఏజెన్సీకి బాధ్యతలను అప్పగించగానే 36 నెలల్లో దీని రీ డెవలప్‌మెంట్‌ను పూర్తి చేయాలని ఏజెన్సీకి దక్షిణమధ్య రైల్వే గడువు విధించింది.

స్టేషన్ అభివృద్ధికి సంబంధించి ముఖ్యాంశాలు ఇలా…
-రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ద్వారా నగరంలోని ప్రధాన భాగం అభివృద్ధి చెందడంతో పాటు బహుళ రవాణా వ్యవస్థతో ప్రయాణికులు ఒక చోట నుంచి మరో చోటుకి ఆటంకాలు లేకుండా ప్రయాణించవచ్చు.
రైలు ప్రయాణికులకు స్టేషన్లో మెరుగైన ప్రయాణ అనుంధానం ఉంటుంది. ప్రయాణికులను దింపడానికి, చేర్చడానికి అనువైన ప్రదేశాలు ఏర్పాటుతో పాటు తగినంత పార్కింగ్ సౌకర్యం ఉంటుంది.
రద్దీ ప్రాంతాల్లో రద్దీని తగ్గించడానికి, నగర రోడ్డు నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి ఇది తోడ్పాడునందిస్తుంది. రైల్వే స్టేషన్, చుట్టుపక్కల ట్రాఫిక్ వ్యవస్థ మెరుగవుతుంది.
స్థాని సంస్థల వ్యాపారాలకు వ్యాపార అవకాశాలు కల్పించి ఆదాయం పెరగడానికి నూతన సిటీ సెంటర్
ఏర్పాటు చేసినట్టు అవుతుంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధిలో భాగంగా కల్పించే నూతన వసతులు ఇలా…
ప్రస్తుత ఉత్తరం వైపు భాగంలో జీ + 3 అంతస్తులు – 22,516 చదరపు మీటర్లతో నూతన స్టేషన్ భవనం
ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత దక్షిణం వైపు భాగంలో భవనం జీ + 3 అంతస్తులు – 14,792 చదరపు మీటర్లతో విస్తరణ,
అభివృద్ధిని చేపట్టనున్నారు.
108 మీటర్లతో రెండు అంతస్తుల స్కై కాన్‌కార్స్ నిర్మాణం. మొదటి అంతస్తు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రెండో అంతస్తు ప్రజలకు రూఫ్ టాప్ ప్లాజాగా (24,604 చదరపు మీటర్లు) అందుబాటులో ఉంటుంది.
స్టేషన్ ఉత్తరంపై ఒక మల్టీ లెవల్ (ఐదు లెవల్లో పార్కింగ్ ఏర్పాటు చేయాలని) దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. దీంతోపాటు స్టేషన్లోని దక్షిణం వైపున విడిగా ఒక అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుత ప్లాట్‌ఫాంలు నూతన స్టేషన్‌లకు అనువుగా పూర్తి పైకప్పుతో అభివృద్ధి చేయబడుతాయి.
ఉత్తరం అండ్ దక్షిణం వైపు భవనాల వద్ద ట్రావెలేటర్స్ సహా రెండు వాక్‌వేలు (7.5 మీటర్లు) నిర్మాణం జరగనుంది.
టెన్సిల్ ఫాబ్రిక్‌తో క్యాన్‌పై (డ్రాప్ ఆఫ్/పికప్ ప్రదేశాలు) నిర్మాణం జరగనుంది.
తూర్పు అండ్ పశ్చిమం మెట్రో స్టేషన్లను స్కైవేతో అనుసంధానిస్తూ ఉత్తరం వైపు వద్ద వాక్‌వేను ఏర్పాటు చేయనున్నారు.
-ప్రత్యేకంగా ప్రవేశించే, బయటకు వెళ్లే మార్గాల్లో (డ్రాప్ ఆఫ్ అండ్ పికప్ ప్రదేశాలు) ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా
వచ్చేవారికి, బయలు దేరే ప్రయాణికులకు, వాహనాల కదలికలకు ఇబ్బందులు ఉండవు. దీంతోపాటు- 5000 కేవిపి సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
గతంలో రెండుసార్లు టెండర్‌లు పిలిచినా స్పందన లేదు….
గతంలో రైల్వే శాఖ అన్ని రైల్వే స్టేషన్‌ల అభివృద్ధికి ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌ఎస్‌డిసి) ప్రారంభించింది. ఈ సంస్థ రైల్వే శాఖకు ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషించడంతో పాటు వాటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని పొందేందుకు ఐఆర్‌ఎస్‌డిసి ఏర్పాట్లు చేస్తుంటుంది. అయితే ఐఆర్‌ఎస్‌డిసి సంస్థ ప్రస్తుతం మొదటగా సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రణాళికను రూపొందించడంతో పాటు (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) నోటిఫికేషన్‌ను జారీ చేసి గతంలో పిపిపి పద్ధతిలో రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం రెండుసార్లు టెండర్లు పిలవగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ పలు ముఖ్యమైన స్టేషన్‌ల అభివృద్ధికి తానే ముందుకు వచ్చింది.
రెండో విడతలో నాంపల్లి, కాచిగూడ………
రెండో విడతలో నాంపల్లి, కాచిగూడ, బేగంపేట, లింగంపల్లి, కాజీపేట, వరంగల్, తాండూరు, వికారాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, ఖమ్మం తదితర స్టేషన్లను కూడా రీ డెవలప్‌మెంట్ చేయాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News