Monday, April 29, 2024

కోహ్లీ కెప్టెన్సీ అద్భుతం

- Advertisement -
- Advertisement -

కరాచి: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుంది. ఊహించని రీతిలో 466 పరుగులు భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ శతకం బాదగా, బౌలర్లు సమష్టిగా రాణించారు. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో 2-1ఆధిక్యంలో నిలిచింది. ‘భారత్ ఆటతీరు.. ముఖ్యంగా విదేశాల్లో ఆ జట్టు ప్రదర్శనను ప్రశంసించాలి. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయినా.. తర్వాత నాలుగు రోజులు ఆడిన ఘనత టీమ్ ఇండియాకే దక్కుతుంది. ఒక దశలో అండర్ డాగ్స్ అయిన జట్టు.. ఆ తర్వాత విజయం సాధించినప్పుడు అందులో కెప్టెన్ కీలకంగా ఉంటాడు’ అని ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లీ తన జట్టును అద్భుతంగా నడిపించాడు. జట్టులో యువ క్రికెటర్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారు. వీరిని సమన్వయం చేసుకుంటూ చక్కగా ముందుకెళ్లాడు. ఈ టెస్టులో అతడు ఎక్కడా నిరుత్సాహ పడలేదు.191 పరుగులకే జట్టు ఆలౌట్ అయినప్పటికీ కోహ్లీ బాడీ లాంగ్వేజ్ జట్టులో ప్రతిబింబించింది’ అని ఇంజమామ్ ప్రశంసించాడు.
అందుకే కోహ్లీ గొప్ప నాయకుడయ్యాడు: వివిఎస్
విరాట్ కోహ్లీ నాయకత్వంపై మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటపట్ల అతడి దృక్పథం.. బాడీ లాంగ్వేజ్ కోహ్లీకి ఓ ప్రత్యేకత తెచ్చిపెట్టాయన్నాడు. ‘నేను అడినప్పటి కెప్టెన్ సహా చాలా మంది కెప్టెన్లు .. తమ నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు. ప్రస్తుతం కోహ్లీ కూడా అదే చేస్తున్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నంతకాలం.. ఎవరేమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. అందుకే అతడు గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు. నేను కూడా దాన్ని సమర్థిస్తా’ అని లక్ష్మణ్ అన్నాడు. ‘ఆటపట్ల అతడి దృక్పథం, బాడీ లాంగ్వేజ్ కూడా గొప్పగా ఉంటాయి. సుదీర్ఘ కాలం దాన్ని కొనసాగించడం అసాధ్యం. కానీ కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా అదే తీవ్రతతో ఆడుతున్నాడు. ఎన్నో బరువు బాధ్యతలను భుజానికెత్తుకుని భారత జట్టును నడిపించడమనేది అంత సులభమేమీ కాదు.అయినా కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు’ అని లక్ష్మణ్ ప్రశంసించాడు.

Inzamam praises Virat Kohli’s Captaincy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News