Monday, April 29, 2024

హైదరాబాద్‌కు పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌కు పరీక్ష.. నేడు ఢిల్లీతో పోరు

IPL 2020: SRH vs DC Match Tomorrow

అబుదాబి: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం జరిగే కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలపై కన్నేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా హైదరాబాద్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన హైదరాబాద్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ వైఫల్యం హైదరాబాద్‌కు అతి పెద్ద సమస్యగా తయారైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే వార్నర్ రెండు మ్యాచుల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. ఇక తొలి మ్యాచ్‌లో మెరిసిన బైర్‌స్టో కోల్‌కతాపై తేలిపోయాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లు అంతంత మాత్రంగానే రాణిస్తుండడం హైదరాబాద్ బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లోనైన వీరిద్దరూ తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు వార్నర్ చెలరేగితే మాత్రం హైదరాబాద్‌కు తిరుగే ఉండదు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే వార్నర్‌పైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇదిలావుండగా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచిన మనీష్ పాండే ఈ మ్యాచ్‌లో కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే అతని బ్యాటింగ్‌లో మునుపటి మెరుపులు కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడితే జట్టు బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక కిందటి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న వృద్ధిమాన్ సాహా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. అతని బ్యాటింగ్ తీరు ఐపిఎల్‌కు ఏమాత్రం సరిపోదనే విషయం మరోసారి రుజువైంది. అతను పరుగులు సాధించినా డిఫెన్స్‌కే పరిమితం కావడంతో స్కోరు వేగాన్ని పుంజుకోలేదు. జట్టు భారీ ఆశలు పెట్టుకున్న అఫ్గాన్ స్టార్లు మహ్మద్ నబి, రషీద్ ఖాన్‌లు కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నారు. ఐపిఎల్‌లోనే అత్యంత ప్రతిభావంతుడైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న రషీద్ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోయాడు. నబి కూడా పెద్దగా రాణించలేదు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా రెండు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. కనీసంఢిల్లీపైనైన రాణించాలని జట్టు కోరుకుంటుంది. మిగతా వారు కూడా అంతంత మాత్రం ఆటతో సతమతమవుతున్నారు. దీంతో హైదరాబాద్‌కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. అయితేఢిల్లీపై మాత్రం మెరుగైన ఆటను కనబరచాలని సన్‌రైజర్స్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇందులో ఎంతవరకు సఫలం అవుతారో బరిలోకి దిగితేకానీ తెలియదు.
హ్యాట్రిక్‌పై కన్ను

IPL 2020: SRH vs DC Match Tomorrow
మరోవైపు ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది. కిందటి మ్యాచ్‌లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించింది. అంతేగాక తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో జయభేరి మోగించింది. ఇక హైదరాబాద్‌పై కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. రిషబ్ పంత్, శిఖర్ ధావన్, పృథ్వీషా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పాటిన్సన్, అక్షర్ పటేల్, స్టోయినిస్ తదితరులతో ఢిల్లీ చాలా బలంగా ఉంది. సమష్టిగా రాణించడం ఢిల్లీకి అతి పెద్ద బలంగా మారింది. ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా రాణించి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలనే పట్టుదలతో ఢిల్లీ ఉంది.

IPL 2020: SRH vs DC Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News