Friday, May 17, 2024

ఐర్లాండ్ సూపర్ గెలుపు

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ నోయిడా: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. సోమవార ఇక్కడ జరిగిన ఆఖరి మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఇందులో 9 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఐర్లాండ్ విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఓడినా అఫ్గానిస్థాన్ 2-1 తేడాతో సిరీస్‌ను సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ టైగా ముగియక తప్పలేదు. తర్వాత సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో ఐర్లాండ్ జయకేతనం ఎగుర వేసింది. కాగా, ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ అద్భుత ఆరంభాన్ని అందించాడు. ఐర్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన గుర్బాజ్ స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన గుర్బాజ్ 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, మరో 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ఉస్మాన్ ఘని (18)తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన కరీం జన్నత్ వేగంగా 17 పరుగులు చేశాడు. కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే మిగతావారు విఫలం కావడంతో అఫ్గాన్ మ్యాచ్‌ను గెలవలేక పోయింది. ఐర్లాండ్ బౌలర్లు అసాధారణ ఆటతో మ్యాచ్‌ను టైగా ముగించడంలో సఫలమయ్యారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ను గారెత్ డెలాని ఆదుకున్నాడు. అఫ్గాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గారెత్ ఐదు ఫోర్లు, సిక్స్‌తో వేగంగా 37 పరుగులు చేశాడు. హారి టెలర్ (31), ఓపెనర్ కెవిన్ ఓబ్రియాన్ (21) తమవంతు పాత్ర పోషించడంతో ఐర్లాండ్ స్కోరు 142 పరుగులకు చేరింది.

Ireland won Super Over against Afghanistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News