Wednesday, May 1, 2024

రెండో కరోనా డోసు తీసుకున్న ఇజ్రాయిల్ ప్రధాని

- Advertisement -
- Advertisement -

Israeli PM Benjamin Netanyahu gets second Covid dose

జెరూసలేం: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. గత నెలనుంచే ఇజ్రాయిల్‌లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఇప్పటికే ఆ దేశ జనాభాలో 20 శాతంమందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ ఏడాది మార్చి చివరికల్లా వయో వృద్ధులందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని నెతన్యాహు తెలిపారు. మార్చిలో ఆ దేశ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. నెతన్యాహు తన ఎన్నికల ప్రచారానికి వ్యాక్సినేషన్‌ను ఉపయోగించుకుంటున్నట్టుగా విశ్లేషిస్తున్నారు. ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండేళ్ల వ్యవధిలో ఆ దేశం నాలుగోసారి ఎన్నికలకు వెళుతోంది.

Israeli PM Benjamin Netanyahu gets second Covid dose

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News