Monday, April 29, 2024

‘బిబిసి’పై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) రూపొందించిన డాక్యుమెంటరీ రాజకీ య అగ్గి రాజేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ క్రమంలో మంగళవా రం ఢిల్లీ, ముంబయిలోని బిబిసి కార్యాలయాల్లో ఐటి అధికారులు ప్రత్యక్షమయ్యా రు. ఇది కే వలం సర్వే మాత్రమేనని.. సో దాలు కా దని ఐటి అధికారులు వెల్లడించారు. పన్నుల అవకతవకల ఆరోపణల పై ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉద్యోగులు సిస్ట్టమ్స్ వాడవద్దని, ఇంట్లోనే ఉండాలని అధికారులు చెప్పిన ట్లు తెలుస్తోంది. పాత్రికేయుల ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకునట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్‌లో అక్రమాలు జరిగినట్లు బిబిసి పై ఆరోపణలున్నాయి. బిబిసిపై ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కొన్ని వర్గాలద్వారా తెలుస్తోంది. బిబిసికి గతంలోనే నోటీసులు జా రీ చేశారని, అయితే ఆ సంస్థ సహకరించలేదని, తన లాభాలను గణనీయంగా ప క్కదారి పట్టించిందని ఐటి అధికారులు ఆ రోపిస్తున్నారు. ఇందులో భాగంగానే బిబిసి అకౌంట్ బుక్స్‌ను తనిఖీచేస్తున్నామని, ఎటువంటి సోదాలు నిర్వహించడం లేదని వారు చెప్పారు. ఈ దాడుల్లో ఐటి అధికారులు కేవలం బిబిసి కార్యాలయాల్లో సోదాలకే పరిమితమయ్యారు. ఆ సంస్థ ప్రయోటర్లు లేదా డైరెక్టరల్ల నివాసాలపై ఎలాంటి దాడులు నిర్వహించలేదు.

పూర్తిగా సహకరిస్తున్నాం : బిబిసి

కాగా ఐటి అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని బిబిసి తెలిపింది.ప్రస్తుతం ఢిల్లీ, ముంబయిలోని బిబిసి కార్యాలయాల్లో ఐటి అధికారులు ఉన్నారు. మేం వారికి సహకరిస్తున్నాం. ఈ వ్యవహారం త్వరలోనే సద్దుమణుగుతుందని ఆశిస్తున్నాం’ అని బిబిసి ట్వీట్ చేసింది.

అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్

అయితే ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.‘ మేము అదానీగ్రూపై వెలువడిన నివేదిక గురించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం బిబిసి వెంట పడుతోంది. వినాశకాలే విపరీత బుద్ధిః’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ కూడా బిబిసిపై ఐటి దాడిని ఖండించింది. ఆ పార్టీ ఎంపి మహువా మొయిత్రా తన ట్విట్టర్‌లో ఈ దాడులపై స్పందించారు.బిబిసిపై జరుగుతున్న ఐటి దాడులు నిజమేనా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇంత హటాత్తుగా ఎలా దాడి చేశారంటూ తన ట్వీట్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.సెబి ఆఫీసులో అదానీకి స్నాక్స్ ఇస్తూ బిబిసి కార్యాలయాలపై ఐటి దాడులు నిర్వహిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాగా బిబిసి కార్యాలయాల్లో ఐటి సర్వేపై ఆమ్‌ఆద్మీ పార్టీ సైతం మండిపడింది.

ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వలో అత్యున్నత స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. సిపిఎం కూడా ఐటి దాడులపై కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతూభారత దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించింది.‘ మొదట బిబిసి డాక్యుమెంటరీని నిషేధించారు. అ తర్వాత అదాని వ్యవహారంపై జెపిసిని వేయలేదు. ఇప్పుడు బిబిసి కార్యాలయాలపై ఐటి దాడులు జరుగుతున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్ల్లేనా?’ అని సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ఈ దాడులను సైద్ధాంతిక ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. బిబిసి కార్యాలయాల్లో ఐటి సోదాలపై ఎడిటర్స్ గిల్డ్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని విమర్శించే సంస్థలను బెదిరించడానికి, వేధింపులకు గురి చేయడానికి ప్రభుత్వ ఏజన్సీలను ఉపయోగించుకునే ధోరణిలో భాగంగా దీన్ని పేర్కొంది.

తోసిపుచ్చిన బిజెపి

అయితే విపక్షాల విమర్శలను బిజెపి తోసిపుచ్చింది.‘ భారత్‌లో పనిచేస్తున్న ఏ సంస్థ అయినా ఇక్కడి చట్టాలను అనుసరించాలి. చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తే ఎందుకు భయపడాలి? ఐటి అధికారులను వారి పని వారు చేసుకోనివ్వండి. బిబిసి ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయ సంస్థ. తప్పుడు ప్రచారం విషయంలో బిబిసికి, కాంగ్రెస్‌కు పోలికలున్నాయి’ అని బిజెపి జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ముంబయిలో మాట్లాడుతూ చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. సోదాల తర్వాత ఐటి శాఖ వివరాలను వెల్లడిస్తూ ప్రకటన చేస్తుందని ఆయన అన్నారు.

నిశితంగా గమనిస్తున్న బ్రిటన్

ఢిల్లీ, ముంబయిలోని బిబిసి కార్యాలయాల్లో ఆదాయం పన్ను శాఖ అధికారుల తనిఖీల తర్వాత బ్రిటన్ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని రిషి సునాక్ ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఐటి చర్యకు సంబంధించి ప్రభుత్వం వైపునుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేనప్పటికీ, బిబిసి కార్యాలయాలపై ఐటి సోదాలకు సంబంధించిన వార్తలను తాము నిశితంగా గమనిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా బిబిసి కార్యాలయాలపై ఐటి సోదాలపై బ్రిటన్‌లోని మేధావి వర్గాలు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నాయి. ‘ప్రతిఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.ఈ ఐటి సర్వే విషయంలో ఎవరినీ ఫూల్ చేయలేరు. ఎందుకంటే ఇది ఇటీవలి బిబిసి డాక్యుమంటరీకి ప్రతీకార చర్యే’ అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త అయిన డాక్టర్ ముకుళికా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రిటన్‌లోని మానవ హక్కుల సంస్థ సౌత్ ఇండియా సాలిడారిటీ గ్రూపు సైతం ఇది పూర్తిగా కక్షసాధింపు చర్యేనని అభిప్రాయపడింది.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్య : ఎడిటర్స్ గిల్డ్

న్యూఢిల్లీ : దేశంలోని బిబిసి కార్యాలయాల్లో జరుగుతున్న ఐటి సర్వేలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలను, పాలక వ్యవస్థను విమర్శించే పత్రికా సంస్థలను భయపెట్టడానికి, వేధించడానికి ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకునే ధోరణికి ఐటి శాఖ చేసిన సర్వేలు కొనసాగింపుగా ఉన్నాయని మండిపడింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలోనూ ఇలాగే కొన్ని వార్త సంస్థలపై ఐటి శాఖ సర్వేలు, దాడులు చేసిందని, ప్రతి సందర్భంలోనూ వార్తా సంస్థలు ప్రభుత్వ విధానాలను విమర్శనాత్మక కవరేజీల నేపథ్యంలో దాడులు, సర్వేలు జరిగాయని గుర్తు చేసింది.

ప్రభుత్వ చర్య రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ధోరణిలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టులు, మీడియా సంస్థల హక్కులను అణగదొక్కకుండా, అటువంటి పరిశోధనలన్నింటిలో చాలా శ్రద్ధ, సున్నితత్వం చూపాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా డిమాండ్. మీడియా సంస్థలు చేసే పరిశోధనలు నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్వహించబడుతున్నాయని పేర్కొంది. స్వతంత్ర మీడియాను బెదిరించే వేధింపుల సాధనంగా ఏజెన్సీల స్థాయి దిగజారకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని మరోసారి గుర్తు చేస్తున్నామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News