Monday, April 29, 2024

ఇది మాది: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై సోనియా స్పందన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన మహిళా రిజర్వేషన బిల్లును ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టనున్నట్లు ఊహాగానాలు వెలువుడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ మంగళవారం స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తమదని ఆమె తెలిపారు. దీర్ఘకాలంగా లోక్‌సభలో ఆమోదానికి నోచుకోకుండా ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెలువడిన వార్తలను కాంగ్రెస్ సోమవారం స్వాగతించింది.

మంగళవారం పార్లమెంట్ భవనంలోకి ప్రవేశిస్తున్న సోనియా గాంధీని విలేకరులు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రశ్నించగా ఇది తమది అని ఆమె చెప్పారు.

కాగా..కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో ఒక పోస్టు వేస్తూ కేంద్ర క్యాబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు వచ్చిన వార్తలను స్వాగతిస్తున్నామని, బిల్లుకు సంబంధించిన వివరాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. దీనిపై అత్యంత రహస్యంగా వ్యవహరించడానికి బదులుగా పార్లమెంటరీ పార్టీలకు చెందిన అఖిల పక్ష సమావేశంలో చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఉంటే బాగుండేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News