Monday, April 29, 2024

జయ ఇంటి తాళాలు మేనకోడలు దీపకు అప్పగింత

- Advertisement -
- Advertisement -

Jayalalithaa's Niece Takes Possession Of Chennai Home

చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత మేనకోడలు జె దీప గురువారం తన మేనత్తకు చెందిన పోయెస్ గార్డెన్ నివాసం తాళాలను శుక్రవారం అధికారికంగా అందుకున్నారు. దీంతో ఈ భవనం స్వాధీనం కోసం దీప సాగించిన సుదీర్ఘ న్యాయపోరాటం ముగిసినట్లయింది. జయలలిత నివసించిన నివాసం వేద నిలయం తాళాలను ఆమె వారసులకు అప్పగించాలంటూ నవంబర్ 24న మద్రాసు హైకోర్టు వెలువరించిన తీర్పు మేరకు చెన్నై కలెక్టర్ జె విజయ రాణి ఇంటి తాళాలను దీపకు అందచేశారు. ఇది చాలా గొప్ప విజయమని, తన మేనత్త చనిపోయిన తర్వాత ఆమె ఇంట్లోకి తొలిసారి అడుగుపెడుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందని ఈ సందర్భంగా దీప తెలిపారు. ఆమె తన భర్త మాధవన్, శ్రేయోభిలాషులతో కలసి ఇంట్లోకి అడుగుపెట్టి తన మేనత్త జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News