Sunday, April 28, 2024

ఎంఎల్ఎ బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టుల రాస్తారోకో

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : జర్నలిస్టులపై అనుచిత వాఖ్యలు చేసిన చెన్నూరు ఎంఎల్ఎ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ సోమవారం దండేపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జర్నలిస్టుల రాస్తారోకోకు కాంగ్రెస్‌పార్టీ నాయకులు, బిజెపి నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మందమర్రి బిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎంఎల్ఎ సుమన్ వంకర టింకర వార్తలు రాసే వాడొకడు, వీడొకడని అనుచిత వాఖ్యలు చేశాడని అన్నారు. ఒక ప్రధాన హోదాలో ఉండి జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తిస్తూ అనుచిత వాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రవిగౌడ్, వెంకటపతి, ఎనగందుల సత్యం, శ్రీనివాస్, వెంకటేష్, రాజన్న, కుమారస్వామి, ప్రసాద్, సుభాష్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News