Monday, April 29, 2024

జ్యోతిరాదిత్య బిజెపిలో బ్యాక్ బెంచర్

- Advertisement -
- Advertisement -

Jyotiraditya is backbencher in BJP:Rahul Gandhi

 

ఆయనెప్పుడూ ఇక సిఎం కాలేరు.. కాంగ్రెస్‌లో చేరితేనే సాధ్యం
రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌లో ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బిజెపిలో చేరి, బ్యాక్ బెంచర్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అనుబంధ యువజన విభాగం కీలక నేతలతో సోమవారం రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్‌లోనే ఉంటే సింధియా ముఖ్యమంత్రి అయ్యేవారు. ఇప్పుడు బిజెపిలో చేరిపోయి బ్యాక్ బెంచర్‌గా మారిపోయారు. కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ, పార్టీని పటిష్ఠం చేసే అవకాశం దక్కేది. ఏదో ఒకరోజు సీఎం అవుతావని నేను సింధియాతో అప్పట్లోనే చెప్పా. కానీ ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. రాసిపెట్టుకోండి. ఆయనెప్పుడూ సీఎం కాలేరు. సీఎం కావాలంటే తిరిగి కాంగ్రెస్‌లో చేరితేనే సాధ్యమవుతుంది’ అని రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News