Thursday, May 9, 2024

స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతూ…

- Advertisement -
- Advertisement -

Kajal Aggarwal sign her first movie after Marriage

ఒకప్పుడు హీరోయిన్స్‌కి పెళ్లయితే కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడినట్లే. కానీ ఇప్పుడలా కాదు పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు అందాల తారలు. టాలీవుడ్ విషయానికి వస్తే సమంత ఆ విషయంలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు కాజల్ వంతు వచ్చింది. చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హనీమూన్‌కు వెళ్లి వచ్చి భర్తతో వైవాహిక జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తూనే మరోవైపు కెరీర్ పైనా ఫోకస్ పెట్టింది ఈ భామ. పెళ్లికి ముందు కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేసేసి పెళ్లి తర్వాత ఫ్రెష్‌గా సినిమాలకు సైన్ చేస్తోంది.ఆ క్రమంలోనే ఓ తమిళ సినిమాకి కాజల్ కమిట్ అయిందట. ప్రభుదేవా హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ సమ్మర్ నుండి ప్రారంభం కానుందట. మరోవైపు తెలుగులోనూ కాజల్‌కి అవకాశాలొస్తున్నాయట. ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది కాజల్. అలాగే ఆమె నటించిన ‘మోసగాళ్లు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మంచు విష్ణు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Kajal Aggarwal sign her first movie after Marriage

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News