Sunday, April 28, 2024

కాళేశ్వరం…కళంకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వర ప్రదాయిని కాదని, కళంకంగా మారిందని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో శనివారం చర్చ సందర్భం గా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ వాదనలు సాగాయి. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంలో సిఎం రేవంత్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ హయా ంలో పదేళ్లలో తెలంగాణను దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్లతో ఆనాటి సిఎం కెసిఆర్ ఒక కమిటీ వేశారని ఆయన గుర్తు చేశారు.ఐదుగురు సభ్యుల కమిటీ 14పేజీల నివేదిక ఇచ్చిందన్నారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీశ్‌కు గౌరవం ఉండేదని చెప్పారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్ని స్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య 2012లో ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. ప్రాణహిత – చేవెళ్ల నిర్మాణ అడ్డంకులు తొలగిం చేందుకు చర్చలు జరిగాయన్నారు. అంత ర్రాష్ట్ర బోర్డు, స్టాండింగ్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. ప్రాణహిత చేవెళ్లకు అడ్డంకులు  తొలగించేందుకు మహారాష్ట్ర సిఎంతో, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఎపి సి ఎం చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు ప్రాణహిత వల్ల మహారాష్ట్రలో ముంపుకు గురయ్యేది 1850 ఎకరాల పట్టా భూములు మాత్రమేనన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన కెసిఆర్‌దేనని చెప్పారు. మేడిగడ్డ ద్వారా మిడ్ మానేరుకు 160 టిఎంసిల ఎత్తిపోతల సరికాదని కమిటీ చెప్పింది. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే నిరుపయోగమని ఐదుగురు ఇంజినీర్ల కమిటీ తేల్చింది. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని కెసిఆర్‌కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియ దన్నారు. కమిటీ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారని ఆరోపించారు. ఈ నివేదికను తొక్కిపెట్టి మామా అల్లుళ్లు ప్రాజెక్టు నిర్మించారన్నారు. ఇదే విషయాన్ని తొమ్మిదేళ్ల క్రితం ‘మేడిగడ్డ మేడిపండేనా’ అని ఓ పత్రికలో రాసిన కథనాన్ని సభలో చూపారు.

తెలంగాణ ఖాజానాను కొల్లగొట్టేందు కు ఇంత దుర్మార్గానికి తెగపడ్డారని ఆరోపించారు. కెసిఆర్, హరీశ్ కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో వాళ్లు తెలుసుకోవాలన్నారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని హరీశ్‌రావుపై మండిపడ్డారు. ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా ఇంకా వాదిస్తారా? అని సిఎం ప్రశ్నించారు. ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా? అని నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు, తొండి వాదనలు వద్దని హరీశ్‌రావుకు సూచించారు. మీరు నియమిం చిన అధికారుల నివేదికనే మీరు తప్పు పడతారా? అని ప్రశ్నించారు. జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి విచారణకు వచ్చినపుడు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో కన్ఫెక్షన్ స్టేట్ మెంట్ ఇవ్వాలని హరీశ్ రావుకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News