Sunday, April 28, 2024

రాజరాజేశ్వరికి జలసిరి

- Advertisement -
- Advertisement -

Rajarajeswari reservoir

 

ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు కాళేశ్వరం నీటి ఉరకలు

ధర్మారం : కాళేశ్వర జలాలు విడుదలయ్యాయి. ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర రిజర్వాయర్‌కు నిరంతరం పంపింగ్ ద్వారా గత రెండు రోజుల నుంచి రాత్రి వేళల్లో కాళేశ్వరం నీటిని నిరాటకంగా సరఫ రా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే మేడిగడ్డ, అ న్నారం, సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తి పోసిన నీటిని రాజరాజేశ్వర రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా సరఫరా చేస్తున్నారు. మేడారం ఆరో ప్యాకెజీలోకి బాహుబలి మోటార్లలో ఆరు మోటర్లను మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద యం వరకు నడిపారు. ఒక్కో మోటార్ 3 వేల 15 0 క్యూసెక్కుల చొప్పున 0.55 టిఎంసిల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తి పోయగా, అక్కడి నుంచి ఏడో ప్యాకేజీ భూగర్భ సొరంగం ద్వారా లక్ష్మిపూర్‌లోని 8వ ప్యాకేజీలో నిర్మించిన సర్జిపూల్‌కు తరలించారు.

అక్కడ సైతం గాయత్రి పంపు హౌస్‌లో మో టర్లు రన్ చేసి రాజరాజేశ్వరి రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 12.5 టిఎంసిల నీరు నిల్వ ఉండగా, మళ్లీ మేడిగడ్డ నుంచి కాళేశ్వరం జలాలు నింపేందుకు అధికార యంత్రా ంగం సిద్ధంగా ఉన్నది. తొలిరోజు సోమవారం రాత్రి కొద్దిగా నడిచిన మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నడుస్తూనే ఉ న్నాయి. ప్రస్తుత రబీ సీజన్ పంటలకు మంచి నీటి అవసరాలు తీర్చేందు కు ప్రభుత్వం కాళేశ్వరం జలాలను సరఫరా చేస్తుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్ల వేంకటేశ్వర్, ఇఇ నూనె శ్రీధర్‌ల అధ్వర్యంలో డిఇఇ నర్సింగారావు, ఎఇఇలు ఉపేందర్, శ్రీనివాస్‌లు నీటి విడుదలను పర్యవేక్షిస్తున్నారు.

Kaleshwaram water for Rajarajeswari reservoir
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News