Monday, April 29, 2024

కల్యాణ్ రామ్ ‘డెవిల్’ ఫస్ట్ లుక్ అదిరింది..

- Advertisement -
- Advertisement -

వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయడానికి డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా మూడు కొత్త సినిమాలను ప్రకటించారు కల్యాణ్ రామ్. ఈ నేపథ్యంలో ‘డెవిల్‌” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌లో వస్తున్న 21వ మూవీ. ఇప్పటికే విడుదల చేయబడిన ‘ఎన్‌కెఆర్21’ ప్రీలుక్ పోస్టర్ ఆసక్తిని కలిగించి. ఇక ‘డెవిల్’ టైటిల్ కథానాయకుడి క్రూరత్వాన్ని సూచిస్తుంది. దీనికి ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ తుపాకీ పట్టుకొని రైలుకు వేలాడుతూ కనిపిస్తున్నాడు. ఇందులో బ్లేజర్, పంచెకట్టు ధరించి ఉన్న కళ్యాణ్ రామ్.. పొడవాటి జుట్టు, గడ్డం మీసాలతో మ్యాన్లీగా ఉన్నాడు. ట్రైన్ మీద ఇండియన్ ఫ్లాగ్ తో కొందరు వ్యక్తులు ఉండటం చూస్తుంటే.. కళ్యాణ్ రామ్ పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. అతని తలకు దెబ్బలు.. ఛాతీ గాయం నుంచి రక్తం కారడం గమనించవచ్చు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, హీరో గెటప్ ఆకట్టుకునేలా ఉండటంతో పాటుగా సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇక 1945లో బ్రిటీష్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఒక చీకటి రహస్యాన్ని చేధించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథ ఇది. కళ్యాణ్ రామ్ మునుపెన్నడూ చేయని సరికొత్త థీమ్‌తో వస్తున్నాడు.

దిల్‌రాజు బ్యానర్‌లో…

నందమూరి కళ్యాణ్‌రామ్ తన 20వ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో చేయనున్నట్లు ప్రకటించారు. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్‌గా మారిన కేవీ గుహన్ దర్శకత్వంలో ‘ఎన్‌కెఆర్20’ సినిమా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కళ్యాణ్ రామ్‌కు బర్త్ డే విషెస్ అందిస్తూ ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ‘క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్’ అని ప్రస్తావించడాన్ని బట్టి చూస్తుంటే ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనిపిస్తోంది.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై…
నందమూరి కళ్యాణ్‌రామ్ తన 22వ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌బ్యానర్‌పై చేయనున్నారు. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. చిత్ర దర్శకుడు, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఫిల్మ్‌మేకర్స్ తెలియజేశారు.

Kalyan Ram’s DEVIL Movie first Look Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News