Wednesday, May 1, 2024

హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి

- Advertisement -
- Advertisement -

cm-kcr

 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా సోకిన వారిలో.. జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ లో హైదారబాద్ తోపాటు ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈరోజు కొత్తగా మరో 32 కరోనా పాజిటీవ్ కేసులు నిర్ధారణ అయ్యాయని, మరొకరు మరణించారని సిఎంకు అధికారులు తెలిపారు. కేసులు ఎక్కవవుతున్న నేపథ్యంలో అన్ని లాబరేటరీ ఆస్పత్రులను సిద్ధం చేశామని అధికారులు చెప్పారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా.. ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేశామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారిగా విభజించి.. ఒక్కో జోన్ ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని సిఎం అధికారులకు సూచించారు.

‘పాజిటీవ్ కేసులు నమోదైన కంటోన్ మెంట్లను మరింత పకడ్బందిగా నిర్వహించాలి. దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటీవ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వైద్య శాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలి. జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పాజిటీవ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా వ్యాప్తి చెందే అవకాశాలు కూడా హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నాయి.  కాబట్టి హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లు, 17 యూనిట్లుగా విభజించాలి. ప్రతీ యూనిట్ కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీస్ అధికారిని, రెవెన్యూ అధికారి, మున్సిపల్ అధికారిని నియమించాలి. పాజిటీవ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేసిన 246 కంటైన్ మెంట్లను మరింత పకడ్బందిగా నిర్వహించాలి. కంటైన్ మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు.. బయటివారిని లోపటికి పోనీయొద్దు’ అని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

KCR High level Meeting with Official at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News