Saturday, April 27, 2024

జైలు నుంచి కేజ్రీవాల్ పాలన స్టార్ట్.. మంత్రికి తొలి ఉత్తర్వు జారీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నగర ప్రభుత్వ కార్యకలాపాలపై కస్టడీలో నుంచే తొలి ఆదేశం జారీ చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో నెలకొన్న నీటి, మురుగునీటి సమస్యలను పరిష్కరించవలసిందని జల వనరుల శాఖ మంత్రి ఆతిషికి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. ఆతిషి ఆదివారం విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, తనకు ఆ ఉత్తర్వు శనివారం అందిండని, స్వయంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల పట్ల కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తుండడం తన కన్నీళ్లు తెప్పించిందని తెలియజేశారు.

ఎక్సైజ్ విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసు సందర్భంగా కేజ్రీవాల్ (55)ను ఇడి గురువారం ఆయన అధికార నివాసం నుంచి అరెస్టు చేసింది. ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను ఒక కోర్లు ఈ నెల 28 వరకు ఇడి కస్టడీకి శుక్రవారం పంపింది. వేసవి నెలలు సమీపిస్తున్నందున నీటి సరఫరాను పెంచడానికి కొరత ఉన్న ప్రాంతాలలో తగినన్ని వాటర్ ట్యాంకర్లను నియగించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆతిషి తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇతర అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని కేజ్రీవాల్ ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నక్ వికె సక్సేనా సాయం తీసుకోవలసిందని కూడా కేజ్రీవాల్ సూచించారని, సక్సేనా సాయం చేయగలరని ఆయన ఆశిస్తున్నారని ఆతిషి తెలిపారు.

జైలు నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
జైలు నిర్బంధితులు వారంలో రెండు సమావేశాలు మాత్రమే నిర్వహించవచ్చునని ఢిల్లీ తీహార్ జైలు మాజీ లా ఆఫీసర్ సునీల్ గుప్తా సూచించారు. దాని వల్ల ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వహించడం కేజ్రీవాల్‌కు కష్టం అవుతుందని ఆయన అన్నారు. కేజ్రీవాల్ గృహ నిర్బంధంలో ఉన్నట్లయితే నిర్బంధంలో నుచి కేజ్రీవాల్ పాలనకు మార్గం సుగమం అవుతుంది. ఏ భవనాన్నైనా ఒక జైలుగా మార్చే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్నది. తనను గృహ నిర్బంధంలో ఉంచేలా ఆయనను కేజ్రీవాల్ ఒప్పించగలిగితే ఢిల్లీ ప్రభుత్వ దైనందిన కార్యకలాపాలలో ఆయన భాగస్వామి కాగల అవకాశం లభిస్తుంది. ‘ఏ భవనాన్నైనా జైలుగా ప్రకటించే అధికారం అడ్మినిస్ట్రేటర్‌కు ఉన్నది’ అని సునీల్ గుప్తా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News