Sunday, April 28, 2024

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు ఖమ్మం.. గుమ్మం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మ కంగా భావించిన బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ కు ఖమ్మం గుమ్మం ముస్తాబవుతోంది. ఈ జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణులు అ హోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ సభకు న లుగురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన జాతీయ నేతలు హాజరవుతున్నం దున ఏ చిన్న అంతరాయం కలగుకుండా ఏ ర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఇతర నా యకులు దగ్గర ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తు న్నారు. టిఆర్‌ఎస్ నుంచి బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన బిఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించేందుకు ఖమ్మం సభ నాంది పలకబోతుంది. ఈ సభా వేదిక ద్వారానే బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాచరణను ప్రకటించబోతుంది.

ఈ సభకు కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సహా వివిధ పార్టీలకు చెందిన జాతీయ, రాష్ట్ర పెద్దలు హాజరవుతున్నందున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదిక నిర్మాణం పూర్తయింది. బారికేడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నానికి సభా వేదిక నిర్మాణం పనులు పూర్తవుతాయి. ఈ సభ ద్వారా ప్రస్తుతం దేశానికి బిఆర్‌ఎస్ ఏర్పాటు ఆవశ్యకతను సవివరంగా కెసిఆర్ వివరించనున్నారు. అలాగే ఇప్పటివరకు దేశాన్ని ఏలిన జాతీయ రాజకీయ ప్రభుత్వాల అసమర్థతను మరోసారి తీవ్రస్థాయిలో ఎండగట్టనున్నారు. పాలకుల చిత్తశుద్ధి లోపం కారణంగా భారత్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకరవు పెట్టనున్నారు. కాంగ్రెస్, బిజెపి పాలన వైఫల్యం కారణంగా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను, వాటి పరిష్కారం కోసం బిఆర్‌ఎస్ తలపెట్టే కార్యక్రమాలు, పార్టీ ఎజెండాను వివరించనున్నారు.

ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో సమగ్ర మార్పు కోసం బిఆర్‌ఎస్‌ను బిజెపియేతర పార్టీలు బలపరచాలని కెసిఆర్ కోరనున్నారు. ఇందుకు తమతో కలిసివచ్చే పార్టీలతో ఎలా ముందుకు సాగేందుకు ప్రజల దీవెనలను సైతం బహిరంగ సభలో అభ్యర్థ్ధించనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపరిపోసిన రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోనే మరోసారి దేశ రాజకీయాల్లోనూ అదగరగొట్టాలని కెసిఆర్ భావిస్తున్నారు. అందుకే మొదట్లో ఢిల్లీలో మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్రజల బిజెపిపై సమరభేరి మోగించాలని తలపెట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో జరిగే బహిరంగ సభ ద్వారా బిఆర్‌ఎస్‌ను ఇతర రాష్ట్రాల్లో బలంగా తీసుకెళ్లడంతో పాటుగా కేంద్రంలోని మోడీ సర్కార్‌కు వణుకుపుట్టించే స్థాయిలో సభ నిర్వహిస్తున్నారు. సభ జన సమీకరణకు ఉమ్మడి జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, మహబుబాబాద్ జిల్లాలో విస్తృతంగా మండలాల వారీగా సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి.

సభతో ఇప్పటికే ఖమ్మం నగరం గులాబీ మయమైంది. భారీ కటౌట్లు, ఆర్చీలు, స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు పెద్దఎత్తున్న ఏర్పాటు చేశారు. ప్రధాన రోడ్ల జంక్షన్లను గులాబీ జెండాలతో అలంకరించారు. నూతన కలెక్టరేట్ సమీపంలో 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మందిని సమీకరించాలని లక్షంగా నిర్ణయించి, ఆ దిశగా నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకుగాను స్థ్దానిక ఎంఎల్‌ఎకు తోడు మరికొందరి ముఖ్యనేతలకు బాధ్యతలను అప్పగించారు. సభా వేదికకు సమీపంలో ట్రాఫిక్ సమస్య రాకుండా కాకుండా మరో445 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా 20 పార్కింగ్ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తూర్పు వైపున 235 ఎకరాలు, దక్షినాన 210 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. పార్కింగ్ బాధ్యతలను ఎంఎల్‌సి తాతా మధుకు అప్పగించారు. వేదిక నిర్మాణ బాధ్యతలను ఎంఎల్‌ఎ బాలమల్లు పర్యవేక్షిస్తున్నారు.

ఈ సభకు మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, పాలకుర్తి, మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి, సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్, తుంగతూర్తి, సూర్యాపేట నియోవకవర్గాల నుంచి, ఖమ్మం జిల్లా కేంద్రానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేశారు. అవి సరిపోకపోవడంతో పక్క జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌టిసి బస్సులను కూడా అద్దెకు తీసుకున్నారు. ఖమ్మం నగరానికి దగ్గరగా ఉన్న గ్రామాల నుంచి వేలాది మంది కాలినడకన బహిరంగ సభకు చేరుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెగ్మెంట్ల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైన కార్యకర్తలు, నాయకలు తరలిరానున్నారు. సభా వేదికపై నలుగురు ముఖ్యమంత్రులు, జాతీయ, రాష్ట్ర నేతలతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆసీనులవుతారు.

మిగిలిన మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు ఇతర ముఖ్యనాయకులు వేదిక కింద ముందు వరుసలో కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. అతిథులను దగ్గరుండి స్వాగతం పలికి తిరిగి వీడ్కోలు పలికే మంత్రులకు భాధ్యతలను అప్పగించారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రుల బాధ్యతలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి అప్పగించగా, కేరళ సిఎం బాధ్యతలను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు, సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా బాధ్యతలను బిఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రావణ్‌కు అప్పగించారు. సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ముగ్గురు సిఎంలు ప్రసంగించిన తరువాత చివర్లో బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగించనున్నారు.

సభా ప్రారంభానికి ముందు రసమయి బాలకిషన్, సాయిచంద్‌తో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రధాన బహిరంగ సభ వేదిక పక్కనే మరో వేదికను నిర్మించారు. సభా అనంతరం భారీ ఎత్తున బాణాసంచా కాల్చేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు ముందు నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నలుగురు ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కంటిచూపు సమస్య ఉన్న ఆరుగురికి ముఖ్యమంత్రులు కళ్లజోళ్లను అందజేస్తారు. ఈ సందర్భంగా అతిథులందరినీ నారాయణపేట, భూదాన్ పోచంపల్లి నుంచి తెప్పించిన శాలువాలు, కరీంనగర్ జిల్లా నుంచి తీసుకొచ్చే జ్ఞాపికలతో సత్కరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News