Saturday, April 27, 2024

గృహ హింసను రూపుమాపుదాం

- Advertisement -
- Advertisement -

Kohli and Anushka

ముంబై: కరోనా నేపథ్యంలో భారత్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. గతంతో పోల్చితే లాక్‌డౌన్ సమయంలో గృహ హింస కేసులు గణనీయంగా పెరిగాయి. గృహ సింహ పెరగడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతన్నారు. చాలా చోట్ల పోలీసులకు దీనికి సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. కాగా, గృహి హింస రోజురోజుకు పెరుగుతుండడంతో దీన్ని కరికట్టేందుకు సెలెబ్రిటీలు రంగంలోకి దిగారు. లాక్‌డౌన్ సమయంలో గృహి హింస కేసులు పెరగకుండా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లు రంగంలోకి దిగారు. కరోనా వంటి మహమ్మరి తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుతం క్లిష్ట సమయంలో మహిళలపై హింస పెరగం బాధాకరమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. గృహి హింస మహిళలను చైతన్య పరిచేందుకు ఓ వీడియోను విరుష్కలు రూపొందించారు. గృహ హింస జరిగితే మహిళలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పురుషుల కూడా గృహి హింసకు పాల్పడకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరారు.

Kohli and Anushka video massage on Domestic Violence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News