Monday, April 29, 2024

జోరుగా.. హుషారుగా..

- Advertisement -
- Advertisement -

Kohli celebrated his fourth wedding anniversary

ఘనంగా విరుష్క జంట వివాహ వార్షికోత్సవం

ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన భార్య అనుష్కకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. విరుష్క జోడీకి ఈ వార్షికోత్సవం చాలా ప్రత్యేకమైందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది విరుష్క జంట తొలిసారి తమ ముద్దుల తనయ వామికతో కలిసి దీన్ని జరుపుకున్నారు. ఇక నాలుగో వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకుని కోహ్లి తన భార్య అనుష్క గురించి సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడించాడు. ఇవి వైరల్‌గా మారాయి. అంతేగాక అనుష్క, వామికతో కలిసి ఉన్న ఫొటోనే కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా తన జీవిత భాగస్వామి అనుష్క గురించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు నవ్వులు తెప్పించాయి. నాలుగేళ్లు నేను వేసిన సిల్లీ జోకులను, దాంతో పాటు నా బద్ధకాన్ని భరించావు.

నేను చికాకుగా ఉన్నా ప్రేమించావు. ఈ నాలుగేళ్లు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో నిజాయితీ, ప్రేమ, ధైర్యం ప్రదర్శించిన మహిళగా ఎదిగావు. నాలో ఉన్న చెడును తొలగించి మంచి మనిషిగా మారేందుకు కృషి చేశావు. నీవల్లే నేను ఈ రోజు సమాజంలో మంచి వ్యక్తిగా నిలువగలిగాను. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నన్ను మంచి వైపు నిలబడేలా స్ఫూర్తి నింపావు. ఈ నాలుగేళ్ల కాలంలో నన్ను అన్నివిధాలుగా మార్చివేశావు. నిన్ను సదా ప్రేమిస్తునే ఉంటా. కుటుంబంగా ఇది మొదటి వార్షికోత్సవం. మన జీవితంలో వామిక రావడంతో జీవితం పరిపూర్ణమైందని కోహ్లి పేర్కొన్నాడు. ఇక నాలుగో వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విరుష్క జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News