Saturday, April 27, 2024

కోహ్లి ఓ అద్భుత క్రికెటర్

- Advertisement -
- Advertisement -

Kohli is a fantastic cricketer

 

కరాచీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం ఆమిర్ సోహైల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో కోహ్లి ఒకడన్నాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కోహ్లి తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడని ప్రశంసిచాడు. ఇక, కోహ్లిలా మారాలంటే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చాలా కష్టపడక తప్పదన్నాడు. కోహ్లిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని సూచించాడు. సహచరుల్లో స్ఫూర్తిని నింపడంలో కోహ్లికి ఎవరూ సాటిరారన్నాడు. ఇక బాబర్‌కు కూడా మంచి బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ఎదిగే సత్తా ఉందన్నాడు. కానీ అనుకున్నంత తేలికాదన్నాడు. ఇక, ప్రపంచ క్రికెట్‌లో జావేద్ మియాందాద్, గవాస్కర్, రిచర్డ్ వంటి ఎందరో దిగ్గజాలు ఉన్నారని, వారితో పోల్చితే ఇప్పటి తరం ఆటగాళ్ల ప్రతిభ అంతంత మాత్రమేనన్నాడు. అయితే వీరిలో కోహ్లి పూర్తి భిన్నమైన ఆటగాడని, అతన్ని మించిన బ్యాట్స్‌మన్ ఎవరూ లేరని సోహైల్ స్పష్టం చేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News