Monday, April 29, 2024

రవితేజ వెలుగుతూనే ఉంటాడు

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బి.మధు నిర్మించిన చిత్రం ‘క్రాక్’. డాన్ శ్రీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, నిర్మాతలు బోగవల్లి ప్రసాద్, యం. యల్.కుమార్ చౌదరి, కె.ఎల్. దామోదర ప్రసాద్, నటులు ఆలీ, సముద్రఖని, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, జోష్ రవి, సుధాకర్, వంశీ, కత్తి మహేష్, ముక్కు అవినాష్, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, గేయ రచయిత కాసర్ల శ్యామ్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, స్టంట్ శివ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ చిత్రం మొదటి, రెండవ టికెట్స్‌ను వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి కొనుగోలు చేశారు.

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ “హిట్, ప్లాప్‌లకు సంబంధం లేకుండా తమన్ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తాడు. అలాగే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. సముద్రఖని మంచి రైటర్.. దర్శకుడు. ఈ చిత్రంలో ఆయన విలన్ క్యారెక్టర్ చేశారు. బుర్రా సాయిమాధవ్ మంచి పవర్‌ఫుల్ డైలాగ్స్ రాశారు. శృతిహాసన్‌తో ఇది నా రెండవ సినిమా. తను చాలా బాగా చేసింది. గోపీచంద్ మలినేని చాలా కష్టపడి ఈ సినిమా తీశాడు. మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘క్రాక్’ హ్యాట్రిక్ హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ “ప్రేక్షకులు, అభిమానులు రవితేజ నుండి ఏం కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. మాది సూపర్ హిట్ కాంబినేషన్. ‘క్రాక్’ సినిమాతో మాది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ కాబోతోంది”అని పేర్కొన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ “గత ఏడాది సంక్రాంతికి కాసుల వర్షం కురిసింది. ఈ సంక్రాంతికి ‘క్రాక్’తో అదే రేంజ్‌లో థియేటర్స్ దద్దరిల్లేలా ప్రేక్షకులు రెవిన్యూ ఇచ్చి ముందు రాబోయే సినిమాలకి ధైర్యాన్నివ్వాలి. రవితేజ.. రవి అంటే సన్. సన్ అంటే ఫైర్. రవితేజ వెలుగుతూనే ఉంటాడు. దర్శకులు ఆ ఫైర్‌ని ఎంత వాడుకోవాలో అంత వాడుకోవచ్చు. ఎవరైతే ఆయన్ని కరెక్ట్‌గా వాడుకుంటారో ఆ సినిమా బ్లాస్ట్ అవుతుంది”అని తెలిపారు.

KRACK Movie Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News