Tuesday, May 28, 2024

అంబేద్కర్ ఆలోచనల ఫలితమే తెలంగాణ: కెటిఆర్

- Advertisement -
KTR praise to Dr BR Ambedkar
హైదరాబాద్: స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే అద్భుతమైన దీర్ఘ దృష్టితో భారతదేశ భావి భవిష్యత్తుకు అవసరమైన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయమని మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా  టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినదన్నారు. ఉద్యమ పోరాటంలోనే కాకుండా ప్రభుత్వ పాలనలోనూ అంబేద్కర్ ఆలోచనలే తమకు ప్రాతిపదిక అని కెటిఆర్ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రి  సిహెచ్ మల్లారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మెతుకు ఆనంద్,  ప్రకాష్ గౌడ్, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు ప్రగతి భవన్ లో నివాళులు అర్పించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News