Saturday, April 27, 2024

కల్నల్ సంతోష్‌బాబు చిరస్మరణీయుడు

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ సందేశం స్ఫూర్తిదాయకం
ముఖ్యమంత్రి నిర్ణయం దేశానికే ఆదర్శం
మిలటరీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండ
దివంగత కల్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని
ఆవిష్కరించిన మంత్రులు కెటిఆర్, జగదీష్‌రెడ్డి
విగ్రహం పెట్టాలన్న మా కలను ప్రభుత్వం
సాకారం చేసింది : సంతోష్‌బాబు సతీమణి

KTR praises colonel santosh babu

మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి:  కల్నల్ సంతోష్‌బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడి గా నిలిచిపోతారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నా రు. జాతి ఉన్నంత కాలం ఆయన పేరు చరిత్రపుటల్లో ఉంటుందని చెప్పారు. భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్‌బాబు విగ్రహా న్ని ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా సూర్యా పేట జిల్లా కేంద్రంలో సహచర మంత్రి, స్థానిక శా సనసభ్యులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. సూ ర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు కూడలికి కల్నల్ సంతోష్‌బాబు పేరుతో కూడిన బోర్డును ఆవిష్కరించారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్‌బాబు మరణానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయ సందేశం యావత్ భారతదేశానికి స్ఫూర్తివంతమైందని తెలిపారు. ఆర్మీలో పనిచేసే వారి కుటుంబాలకు భారత ప్రజలు అం డగా ఉంటారనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయం అన్నారు. భారత్, -చైనా సరిహద్దు ల్లో కల్నల్ సంతోష్‌బాబు చనిపోతే ఆయన భౌతిక ఖాయాన్ని తెలంగాణ ప్రభుత్వం హకీంపేట వద్ద నుంచి సూర్యాపేట వరకు తీసుకొస్తున్నప్పుడు దా రిపొడవునా ప్రజలు నీరాజనం పలికిన తీరు కూ డా ముఖ్యమంత్రి  కేసీఆర్ అందించిన సందేశానికి అద్దం పడుతుందన్నారు. అలాంటి త్యాగానికి ఏమిచ్చినా సరిపోదని, దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారి వెంట తెలంగాణ ప్రభుత్వం,ప్రజలు ఉంటారని తెలియజేప్పేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా పుట్టిన వారు మరణించక తప్పదని, జీవించినంత కాలం ఎలా బతికి ఉన్నామన్నది ముఖ్యమని అన్నారు. ఆ కోవలోనే కల్నల్ సంతోష్‌బాబు జాతి ఉన్నంత కాలం ప్రజల మనస్సులో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారన్నారు. అటువంటి మహానీయుడు ప్రాణత్యాగం చేసింది మొదలు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు సహచర మంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. మంత్రులుగా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటున్నా కల్నల్ సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. విగ్రహాన్ని రూపొందించిన శిల్పి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆయనను శాలువాతో ప్రత్యేకంగా సత్కరించారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతకాలం బతికి ఉన్నామనేది ముఖ్యం కాదని, బతికి ఉన్నంత కాలం ఏమి సాధించామన్నదే ముఖ్యమన్నారు. అటువంటి కోవలో కల్నల్ సంతోష్‌బాబు ఉంటారని ఆయన కొనియాడారు. చనిపోయినా జాతి ఉన్నంత కాలం పేరు నిలబడడం కొందరికే దక్కుతుందని, అందులో దివంగత సంతోష్‌బాబు పేరు ఉండడం ఆయన అదృష్టమని అన్నారు. జాతి జీవించి ఉన్నంత కాలం వర్తమానానికి స్ఫూర్తినిచ్చే రీతిలో కల్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు. అందుకు నిరంతరం శ్రమించిన పురపాలక సంఘం పాలకవర్గాన్ని, మున్సిపల్ సిబ్బందిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్‌రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు తేర చిన్నపరెడ్డి, శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, యన్.భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, శాసనమండలి మాజీ సభ్యులు పూల రవీందర్, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, డిసిఎంఎస్ ఛైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జిల్లా పరిషత్తు వైస్ ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సోమా భరత్‌కుమార్, జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ మోహన్‌రావు, మున్సిపల్ కమీషనర్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News