Thursday, May 9, 2024

కాల్పులు జరిపింది ఆశిష్ మిశ్రానే

- Advertisement -
- Advertisement -

Lakhimpur Kheri violence

లఖింపూర్ కేసులో ఫోరెన్సిన్ రిపోర్టులో వెల్లడి

లక్నో: లఖింపూర్ కాల్పుల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులు ప్రధాన నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆ సమయంలో కాల్పులు జరిపాడని ఫోరెన్సిక్ రిపోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 3న జరిగిన ఈ ఘటనలో ఆశిష్ మిశ్రాతో పాటుగా అంకిత్ దాస్ కూడా కాల్పులు జరిపినట్లు ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. నిరసన ప్రదేశంలో జరిగిన కాల్పులకు సంబంధించిన రిపోర్టులను పరిశీలించగా ఆశిష్ మిశ్రాకు చెందిన లైసెన్స్‌డ్ తుపాకీనుంచే ఆ తూటాలు వచ్చాయని ఆ నివేదిక పేర్కొంది. ఇప్పటికే ఈ కాల్పులపై తీవ్ర ఆరోపణలున్నాయి. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన అంశాలతో ఆశిష్ మిశ్రాతో పాటుగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా మరితం ఇరకాటంలో చిక్కుకున్నారు.

ఆశిష్ మిశ్రాను తప్పించేందుకు అజయ్ మిశ్రా చేస్తున్న ప్రయత్నాలకు ఫోరెన్సిక్ నివేదిక భారీ అడ్డుకట్ట వేసింది. గతంలో ఆశిష్ మిశ్రాను తప్పించేందుకు అబద్ధాలు ప్రచారం చేశారు. ఆశిష్ వాహనం నడపలేదని, అసలు అశిష్ ఆ వాహనంలోనే లేరని నిరూపించేందుకు ప్రయత్నించారు. అయితే విచారణలో అవన్నీ అవాస్తవాలని తేలింది. గత అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరుకంగా లఖింపూర్‌లో వందలాది మంది రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అదే సమయంలో కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కాన్వాయ్ రైతులను తొక్కుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు రైతులు, జర్నలిస్టు సహా 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గతంలో అనేక సందర్భాల్లో యుపి ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోమవారం సైతం కేసు దర్యాప్తు విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరుపట్ల తీవ్ర అపంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమిషన్‌పై సంతృప్తిగా లేమని పేర్కొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని బెంచ్ సిట్ దర్యాప్తును పర్యవేక్షించడానికి నేతృత్వంలోని ధర్మాసనం వేరే రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమిస్తామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News