Monday, April 29, 2024

యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

Large scale employment and job opportunities for youth

రంగారెడ్డి: ఎస్ టి సబ్ ప్లాన్ కింద 12వేల కోట్ల తో అభివృద్ధి పనులు చేశామని, 100 కోట్లతో రాష్ట్రంలో ని అన్ని తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండల పరిధిలోగల ఎన్ డి తండా గ్రామ పంచాయతీలో వివిధ అభివృద్ధి పనులకు సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎన్ డి తండా లో 93 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. మా తాండలో మా పాలన నినాదాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు సబితా ధన్యవాదాలు తెలిపారు.  ప్రత్యేక గ్రామ పంచాయతీ లు గా మార్చి నిధుల మంజూరు చేశారని కొనియాడారు.  తాండాలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణంతో తండాల రూపురేఖలు మారుతున్నాయని, రంగారెడ్డి శివారు ప్రాంతాలు పెట్టుబడుల నిలయాలని, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వ్యాపారాలు చేసుకోవటానికి రుణాలు మంజూరు చేస్తామన్నారు.

పల్లె ప్రగతిలో అందరూ సర్పంచ్ లు బాగా పని చేశారని, ఎలాంటి పనులు పెండింగ్ లో లేకుండా చూడాలని, పల్లె నిద్రలో భాగంగా దృష్టికి వచ్చిన డ్రైనేజి నిర్మాణానికి 30 లక్షల తో ప్రతిపాదనలు చేశామని సబితా వివరించారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని అన్ని ఎస్టి తండా గ్రామ పంచాయతీలలో అధికారులు కమ్యూనిటీ హల్ లు, యువజన, మహిళ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20న 3500 ఖాళీలతో మహేశ్వరంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, నిరుద్యోగులు వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 50 వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News