Sunday, April 28, 2024

‘సిద్ధార్థ్ రాయ్’ నుంచి ‘లైఫ్ ఈజ్ దిస్’ బ్యూటిఫుల్ సాంగ్  

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్  చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని చెలియా చాలు పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా సిద్ధార్థ్ రాయ్’ నుంచి లైఫ్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ పాటని ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. స్టార్ కంపోజర్ రధన్ ఈ పాటని మెస్మరైజింగ్ అండ్ గ్రేస్ ఫుల్ నెంబర్ కంపోజ్ చేశారు. కార్తీక్ & శ్రీనిషా జయశీలన్ పాడిన ఈ పాటకు యశస్వీ అందించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ వినాలనిపించే లా వున్నాయి. ఈ పాటలో లీడ్ పెయిర్ లవ్లీ అండ్ రొమాంటిక్ కెమిస్ట్రీ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.

శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె. నాయుడు కెమరా మెన్ గా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News