Saturday, April 27, 2024

ఎస్‌బిఐ కస్టమర్లకు హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

link aadhaar with sbi bank account

న్యూఢిల్లీ : పెన్షన్, ఎల్‌పిజి సబ్సిడీ వంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్‌కు లింక్ చేయాలని దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ కోరింది. చాలా మందికి ఆధార్‌తో ఖాతాలను అనుసంధానించలేదు. అకౌంట్‌ను ఆధార్ తో లింక్ చేయకపోతే ఇంటి వద్ద నుండే లింక్ చేసుకునే అవకాశం బ్యాంక్ కల్పిస్తోంది. ప్రభు త్వ పథకాలను సద్వినియోగం చేసుకోవటానికి బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, బ్యాంకు ఖాతా ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి కాదు, కానీ బ్యాంకు ఖాతాలో ప్రభుత్వ రాయితీ ని పొందాలనుకుంటే ఆధార్ నంబర్‌ను జోడించాలి. 2021 మార్చి 31 నాటికి అన్ని బ్యాంకు ఖాతాలు వినియోగదారుల ఆధార్ సంఖ్యతో అనుసంధానించేలా చూడాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది.

link aadhaar with sbi bank account

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News