Saturday, April 27, 2024

సూరత్‌ ఘటనపై ప్రధాని, రాజస్థాన్‌ సిఎం‌ తీవ్ర దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

loss of lives due to truck accident in Surat is tragic says modi

సూరత్‌: గుజరాత్ రాష్ట్రలోని సూరత్‌ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సూరత్ లోని కోసాంబ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న రాజస్థాన్ కూలీలపైకి ట్రక్కు దూసుకెళ్లి‌, బన్స్‌వార జిల్లాకు చెందిన 15 మంది వలస కూలీలు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీతోపాటు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆక్షాంచారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కింద రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. గుజరాత్‌ సర్కార్ కూడా బాధితకుటుంబాలకు రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర సిఎం విజయ్‌ రుపాని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News