Home తాజా వార్తలు ప్రియురాలి గొంతు కోసి… ప్రియుడి ఉరేసుకొని

ప్రియురాలి గొంతు కోసి… ప్రియుడి ఉరేసుకొని

Lover killed girl friend after suicide

హైదరాబాద్: ప్రియురాలిని చంపి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ శివారులోని మాదాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ జిల్లా కోస్గి మండలం హాకీంపేట వాసి గుడిసె రాములు(25), బొంరాస్ పేట మండలం లగచర్ల గ్రామానికి చెందిన సంతోషి(25) అనే యువతి గత పది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. రాములు-సంతోషి పదో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు. ప్రేమించుకున్నారు కానీ పెళ్లి చేసుకుందామంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఆమె ఇంటర్ వరకు చదువుకోవడంతో హైదరాబాద్‌లో ఓ కోచింగ్ సెంటర్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతోంది. రాములు మాత్రం కారు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పులు ఇద్దరు హైదరాబాద్‌లో కలుసుకుంటారు. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో వారు రూమ్ అద్దెకు తీసుకున్నారు. ఒక రోజు గడవడంతో రూమ్ ఖాళీ చేయాలని హోటల్ సిబ్బంది తెలిపారు. మరో రోజు ఉంటామని వారు చెప్పడంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే ఇద్దరు మధ్య వాగ్వాదం జరుగుతోంది. సాయంత్రం వరకు అందులో నుంచి వారు బయటకు రాకపోవడంతో సిబ్బంది మరో తాళం చేవితో తలుపును తెరిచారు. రాములు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా సంతోషి మాత్రం బాత్రూమ్‌లో రక్తపు మడుగులో కనిపించింది. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను హత్య చేసిన తరువాత అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.