Saturday, April 27, 2024

21 రోజుల లాక్ డౌన్: భార్యభర్తల కష్టానికి దక్కిన ఫలితం..

- Advertisement -
- Advertisement -

 

మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా మొదట విధించిన 21 రోజుల లాక్ డౌన్ కాలాన్ని ఓ జంట ఎంతో చక్కగా ఉపయోగించుకుంది. ఈ స్వీయ నిర్భందం తమకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆ జంట.. ఇంటివద్దే ఒక బావిని తొవ్వి అందరికీ ఆదర్శంగా నిలించింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని వషీమ్ జిల్లాలో కర్ఖెడ్ గ్రామంలో గజనన్ పాక్మోడ్ అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వాళ్లకు ఎన్నో రోజుల నుంచి నీటి సమస్య ఉంది. అయితే, దేశంలో మెల్ల మెల్లగా విస్తరిస్తున్నకరోనా వైరస్ ను అరికట్టేందుకు గత మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 వరకు 21రోజులపాటు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దంపతులిద్దరూ బయటకు వెళ్లకుండా ఇంటి వద్దే నీళ్లకోసం ఒక బావిని తవ్వాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా భార్యభర్తలు పూజా చేసి బావిని తొవ్వడం ప్రారంభించారు. దీన్ని చూసిన చుట్టు ప్రక్కలవారు ఎగతాళి చేసినా వారు పట్టించుకోకుండా ఎంతో పట్టుదలగా ప్రతీరోజు తవ్వుతూనే ఉన్నారు. అలా 21 రోజుల్లో 25 ఫీట్లు తవ్విన తర్వాత వారికి బావిలో నీళ్లు కనిపించాయి. దీంతో ఎవరి సహాయం లేకుండానే ఎంతో కష్టపడి తవ్విన బావిలో నీళ్లు కనిపించడంతో భార్యభర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతీ రోజు వందల సంఖ్యలో కేసులు పయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,666కు చేరుకోగా.. మృతుల సంఖ్య 232కు చేరింది.

Maharashtra Couple Digs a Well at Home Amid Lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News