Monday, April 29, 2024

ఎంపి నామా చొరవతో ఏన్కూరు లిప్ట్‌కు మహర్దశ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం పార్ల మెంట్ సభ్యులు నామా నాగే శ్వరరావు ప్రత్యేక చొరవతో ఏన్కూరు ఎత్తిపోతల పథకానికి మహర్దశ పట్టబోతుంది. 1999లో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి అదనపు సామర్థ్యంతో పునరుద్ధరించి, రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి, 300 ఎకరాలకు అదనంగా సాగునీటి వసతిని కల్పించేందుకు ఎంపి నామా తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసి, పధకం గురించి వివరించగా, పున:రుద్ధరణకు ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని ఎంపి నామా తెలిపారు.

వ్యవ సాయ, తాగు నీటి అవసరాల కోసం ఏన్కూరు సమీపంలోని ఎన్‌ఎస్‌పి కాలువపై 1999లో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అయితే గార్లఒడ్డు, ఏన్కూరు గ్రామాల సమీపంలోని ఏన్కూరు ఎన్‌ఎస్‌పి ప్రధాన కాలువ సుమారు 80 అడుగుల లోతుతో డీప్ కట్‌లో నడుస్తోంది. దీంతోపై గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో గార్లఒడ్డు (ఎం)లోని బోరు బావులు, ఎర్రచెరువు తరచుగా ఎండిపోతున్నాయని నామా సిఎం కెసిఆర్ దృష్టికి తీసికెళ్లారు. ఈ పరిస్థితి కారణంగా సమీప గ్రామాలకు తాగునీరు, సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని అన్నారు.

ఎన్‌ఎస్‌పి ప్రధాన కాలువపై ప్రస్తుతం ఉన్న లిఫ్ట్ స్కీమ్ సుమారు 1000 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి 1999లో ప్రారంభించారని, పంపుసెట్లు, ప్యానెల్ టి మరమ్మతులు, పైపులైన్ లీకేజీల కారణంగా పథకం పాక్షికంగా నడుస్తోందని నామా సిఎంకు వివరించారు. లిప్ట్‌కు అదనపు సామర్థ్యం కల్పించడం ద్వారా అదనంగా 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించడంతో పాటు మార్గంలోని ఎర్రచెరువు అభివృద్ధితో పాటు ఏన్కూరు, గార్లఒడ్డు తదితర గ్రామాలకు తాగు, సాగు నీటిని అందించేందుకు అవకాశం ఉంటుందని నామా సిఎంకు వివరించారు.

పాత లిఫ్ట్ స్కీమ్‌ను అదనపు సామర్థ్యంతో పునరుద్ధ రించాలని ఇటీవల తెలంగాణా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, రైతులు పలుమార్లు ఎంపీ నామాను కలసి, అభ్యర్థించారు. తాజాగా నామా సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడిన ఫలితంగా లిప్ట్ పునరుద్ధరణ, అదనపు సామర్థ్యం కోసం రూ.2.40 కోట్లతో ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News