Saturday, April 27, 2024

మహీంద్ర నుంచి కొత్త బొలెరో

- Advertisement -
- Advertisement -

Mahindra Bolero Neo N10 (O) model

ముంబయి: ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా బొలెరో నియో మోడల్‌లో మరో కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. నియోలో ఎన్4, ఎన్8, ఎన్10 మోడళ్లను జూన్‌లో విడుదల చేసిన కంపెనీ తాజాగా ఈ కోవకే చెందిన ఎన్10(ఓ) వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది మొత్తం ఐదు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.10.69 లక్షలుగా ఉంటుంది. ఎన్10లోని ఫీచర్లే సరికొత్త బొలెరో నియో ఎన్10(ఓ)లోనూ ఉన్నాయి. అయితే అదనంగా ‘ మెకానికల్ లాకింగ్ రేర్ డిఫరెన్షియల్’ అనే అదనపు ఫీచర్‌ను అందిస్తున్నారు.దీనివల్ల వెనక చక్రాలు రెండింటికీ సమానమైన టార్క్ అందుతుంది. కొన్ని సార్లు ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే వీల్ తిరగడం వల్ల సంభవించే ప్రమాదం దీనివల్ల తప్పుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News