Monday, April 29, 2024

నటుడు తపస్‌పాల్ మృతికి కేంద్రమే కారణం: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

CM Mamata Banerjee

 

కోల్‌కతా: సినీనటుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు తపస్‌పాల్ మృతికి కేంద్ర సంస్థల ఒత్తిడి, కక్షసాధింపు రాజకీయాలే కారణమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తపస్ పాల్ భౌతిక కాయాన్ని ప్రజలు నివాళి అర్పించడానికి వీలుగా రవీంద్ర సదన్‌లో ఉంచారు. ఈ సందర్భంగా తపస్‌కు నివాళులు అర్పించిన మమత కేంద్రంపై ధ్వజమెత్తారు. రెండు సార్లు ఎంపిగా పదవిని అలంకరించిన తపస్ గుండెపోటుతో మంగళవారం ముంబై ఆస్పత్రిలో మృతి చెందారు. 2017లో నారద టేప్స్ స్కామ్‌లో నిందితునిగా పేర్కొన్న మరో టిఎంసి నేత సుల్తాన్ అహ్మద్ కూడా ఇలాంటి ఒత్తిడి కారణంగానే గుండెపోటుతో మృతి చెందారని ఆమె ఆరోపించారు.

Mamata Banerjee fires on Centre over Tapas paul Death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News