Saturday, April 27, 2024

సోషల్ మీడియాలో యువతిని వేధిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: యువతిని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోహిత్ ప్రతాప్ కుష్వాహ బి.ఫార్మసీ చదువుతున్నాడు. మేడ్చెల్ జిల్లా, నాగారానికి చెందిన బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఈ క్రమంలోనే 2018లో సోషల్ మీడియాలో ఆర్యన్ కుష్ బాధితురాలికి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ వచ్చింది. దానిని పరిశీలించగా తను చదువుకున్న పాఠశాల స్కూల్ మేట్‌గా భావించి రిక్కెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది.

అప్పటి నుంచి ఇద్దరు ఛాటింగ్ చేసుకునేవారు, కొద్ది రోజుల తర్వాత నిందితుడు యువతిని ప్రైవేట్ ఫోటోలు పంపించమని వేధించడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు నిందితుడికి దూరంగా ఉండడం ప్రారంభించింది. తనతో మాట్లాడకున్నా,ఛాటింగ్ చేయకున్నా చేతిని కోసుకుంటానని బెదిరించేవాడు. దీంతో కొద్ది రోజులు నిందితుడితో ఛాటింగ్ చేసింది. తర్వాత నకిలీ ఇన్‌స్టాగ్రాం ఐడితో ఛాటింగ్ చేయడం మార్ఫింగ్ ఫొటోలు పెడుతున్నాడు. అంతేకాకుండా మార్ఫింగ్ ఫొటోలను బాధితురాలి తండ్రి, తల్లి,సోదరుడికి వాట్సాప్‌లో పంపించాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల నంబర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి యువతిపై అసభ్యంగా కామెంట్లు చేయడం, మార్ఫింగ్ ఫొటోలు పంపిస్తున్నాడు. రోజు రోజుకు నిందితుడి వేధింపులు ఎక్కువ కావడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News